SAMEER Job Vacancies : సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్&రీసెర్చ్ సంస్ధలో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.

SAMEER Job Vacancies :
SAMEER Job Vacancies : సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్&రీసెర్చ్ సంస్ధలో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలను పరిశీలిస్తే రీసెర్చ్ సైంటిస్ట్ 19, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 4 , ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎ 8, ప్రాజెక్ట్ టెక్నీషియన్ 1, ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఎ 3 ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే రీసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్ధులు బీఈ, లేదా బీటెక్, ఎమ్ ఈ, ఎంటెక్ లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లో బీ టెక్ పూర్తి చేసి ఉండాలి.
ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా మరియు టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తై ఉండాలి. ప్రాజెక్ట్ టెక్నీషియన్ ఎ , ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదిగా జనవరి 28, 2023 ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.sameer.gov.in/పరిశీలించగలరు.