SSC CHSL Registration: ఇంటర్ పాసైతే ప్రభుత్వ ఉద్యోగం.. SSC CHSL రిజిస్ట్రేషన్ మొదలు.. ముఖ్యమైన వివరాలు మీకోసం

SSC CHSL Registration: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (​CHSL) పరీక్ష 2025 కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

SSC CHSL 2025 Registration started

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (​CHSL) పరీక్ష 2025 కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి సంబందించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియని సైతం మొదలుపెట్టింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు జులై 18 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అధికారిక వెబ్ సైట్ ssc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. Also Read:బిగ్ అలెర్ట్.. ఎస్సెస్సీ అభ్యర్థులకు ఓటీఆర్ తప్పనిసరి.. లేదంటే నో ఎంట్రీ.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం

ఎస్​ఎస్సీ సీహెచ్​ఎస్​ఎల్​ ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తుల చేసుకోవడానికి చివరి తేదీ: జులై 18
  • ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: జులై 19
  • దరఖాస్తు ఫారమ్ సవరణ ఛార్జీల చెల్లింపు తేదీలు: జులై 23, 24
  • టైర్-I కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 8 నుంచి 18 వరకు
  • టైర్-II కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: 2026 ఫిబ్రవరి, మార్చి
  • ఏమైనా సమస్యలు ఉంటే సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్: 18003093063

ఖాళీలు, వయోపరిమితి, అర్హత వివరాలు:

ఎస్​ఎస్సీ సీహెచ్​ఎస్​ఎల్​ 2025- విద్యార్హతలు

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి (సైన్స్ స్ట్రీమ్‌లో గణితం ఒక సబ్జెక్టుగా ఉండాలి).
  • ఎల్​డీసీ/జేఎస్​ఏ, డీఈఓఏ/డీఈఓ గ్రేడ్ A: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
  • దరఖాస్తు రుసుము: దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, డబ్ల్యూబీడీ, రిజర్వేషన్‌కు అర్హులైన ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.