Railway Jobs: బంపర్ ఆఫర్.. రైల్వేలో 6180 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం
RRB Notification: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6180 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు.

RRB Notification 2025 Released
రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6180 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. వాటిలో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి అర్హత ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. ఇక ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ జూన్ 28 నుంచి మొదలుకానుంది. చివరి తేదీ 28 జూలై గా నిర్ణయించారు.(Also Read: పాలిటెక్నిక్ తర్వాత ఏం చేయాలి? ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ జాబ్ లేదా బిజినెస్.. పూర్తి వివరాలు! )
దరఖాస్తు విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ rrbapply.gov.in లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు: మెుత్తం 6180 పోస్టులకుక్ గాను టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్- 180 పోస్టులు, టెక్నీషియన్ గ్రేడ్ 3 – 6000 పోస్టులకు నియామకాలు జరుగుతాయి.
విద్యార్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో ITI/ BSc/ BE/ BTech/ 3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, మహిళా అభ్యర్థులు రూ. 250 రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఇలా చేసుకోండి:
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in లోకి వెళ్ళాలి.
- హోమ్ పేజీలో అప్లై బటన్‌పై క్లిక్ చేయాలి.
- తరువాత కక్రియేట్ అకౌంట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయాలి.
- తరువాత రుసుము చెల్లించి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
- ఫారం ప్రింటవుట్ తీసుకోవాలి.