Telugu » Education-and-job » Staff Selection Commission To Release Notification For Junior Engineer 2024 Recruitment
SSC JE 2024 Notification : జూనియర్ ఇంజనీర్ 2024 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఎప్పుడంటే? పూర్తివివరాలివే!
SSC JE 2024 Notification : జూనియర్ ఇంజనీర్ పోస్టుల నియామకానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) త్వరలో జేఈ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Staff Selection Commission To Release Notification For Junior Engineer 2024 Recruitment
SSC JE 2024 Notification : వివిధ రాష్ట్రాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అతి త్వరలో జేఈ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. అభ్యర్థులు 1300 కన్నా ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అందిన సమాచారం మేరకు ఎస్ఎస్ఈ జేఈ నోటిఫికేషన్ 2024 ఈ నెల (ఫిబ్రవరి) 29, 2024 నుంచి విడుదల కానుంది. దరఖాస్తు ప్రక్రియ కూడా అదే రోజు ప్రారంభమై మార్చి 29, 2024 కొనసాగనుంది. దరఖాస్తుదారులందరూ ఎస్ఎస్ఈ జూనియర్ ఇంజనీర్ దరఖాస్తు ఫారమ్ ఆన్‌లైన్ ద్వారా గడువు తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం (ssc.nic.in) అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయండి.
వయో పరిమితి :
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన వారికి వయో సడలింపులు.
దరఖాస్తుదారు సివిల్, మెకానికల్, ఇంజనీరింగ్‌లో డిప్లొమాతో పాటు బి.టెక్ డిగ్రీని కలిగి ఉండాలి.
జీతం :
రిక్రూట్‌మెంట్ తర్వాత జూనియర్ ఇంజనీర్లు పే స్కేల్‌లోని లెవెల్-06 కింద రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు వేతనాన్ని పొందవచ్చు. జూనియర్ ఇంజనీర్ పోస్ట్‌తో అనుసంధానమైన అదనపు అలవెన్సులు కూడా పొందవచ్చు.
ఎంపిక ప్రక్రియ :
ఎస్ఎస్ఈ జేఈ పరీక్ష ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష
కంప్యూటర్ ఆధారిత వైద్య పరీక్ష
మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఎలా దరఖాస్తు చేయాలి?:
ఎస్ఎస్ఈ అధికారిక (https://ssc.nic.in/) వెబ్‌సైట్‌ను సందర్శించండి.
SSC JE 2024 రిజిస్ట్రేషన్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
‘కొత్త యూజర్’ లేదా ‘ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి’ అనే ఆప్షన్ ఎంచుకోండి.
మీ పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను సమర్పించండి.
దరఖాస్తు ఫారమ్‌లోని అన్ని ఫీల్డ్‌లను నింపండి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
అవసరమైన రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లించి, ఆపై మీ డివైజ్‌లో రసీదుని డౌన్‌లోడ్ చేసుకోండి.
ఇప్పుడు జేఈ దరఖాస్తు ఫారమ్ 2024 పీడీఎఫ్ సేవ్ చేసి దగ్గర పెట్టుకోండి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను ఇలా సమర్పించండి :
పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం.. ఫోటోగ్రాఫ్‌లు, డిజిటల్ సైన్ అప్‌లోడ్ చేయండి.
దరఖాస్తు ఫారమ్ పార్ట్ IIని పూర్తి చేయడానికి రిజిస్టర్డ్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.
దరఖాస్తులో ఏదైనా తప్పులు ఉన్నాయో లేదో మొత్తం ఫారమ్‌ను ప్రివ్యూ చేయండి.
ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించిన తర్వాత ‘Final Submit’ బటన్‌పై క్లిక్ చేయండి.
ఎస్ఎస్ఈ జేఈ దరఖాస్తుకు అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇవే :