Group I: తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు
ఈ మేరకు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. 60 పోస్టులను యాడ్ చేసి 563 పోస్టులతో కొత్తగా టీఎస్పీఎస్సీ..

Group I
తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. గతంలో గ్రూప్ 1 పరీక్షను రెండుసార్లు నిర్వహించగా రెండు సార్లు రద్దయిన విషయం తెలిసిందే.
టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ కేసు కలకలం సృష్టించడంతో మొదట్లో గ్రూప్ 1 పరీక్ష రద్దయింది. ఆ తర్వాత నిర్వహించిన అదే పరీక్షలో బయోమెట్రిక్ నిబంధనను పాటించలేదని మరోసారి రద్దయింది. 2022లో 503 పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. త్వరలో టీఎస్పీఎస్సీ కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వనుంది.
కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే గ్రూప్-1 పోస్టుల భర్తీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన 503 పోస్టులకు నోటిఫికేషన్‌కి అదనంగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఇంతలోనే తెలంగాణ సర్కారు నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 60 పోస్టులను యాడ్ చేసి 563 పోస్టులతో కొత్తగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుంది.

Group I