TS 10th Supplementary Results: తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్ ఇలా తెలుసుకోండి
తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి.
TS 10th Supplementary Results released
తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. జూన్ 27 మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చారు అధికారులు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఇక టెన్త్ అడ్వాన్సుడ్ సప్లమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 38,741 మంది పరీక్షలు రాయగా 24,415 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 73.35 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు.
మీ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి:
- విద్యార్థులు ముందుగా https://bse.telangana.gov.in/ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో “TG SSC ASE Result 2025” లింక్‌పై క్లిక్ చేయాలి.
- హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.
- సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే స్క్రీన్‌పై రిజల్ట్ డిస్ప్లే అవుతుంది.
- రిజల్ట్స్ కాపీని ప్రింట్ లేద డౌన్లోడ్ చేసుకోవాలి.
