నోటిఫికేషన్ వచ్చేసింది : మే 3 నుంచి తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్
హైదరాబాద్ : ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2019, మార్చి 6 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 6 నుంచి 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో చేసిన

హైదరాబాద్ : ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2019, మార్చి 6 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 6 నుంచి 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో చేసిన
హైదరాబాద్: ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2019, మార్చి 6 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 6 నుంచి 9 వరకు అప్లికేషన్స్‌లో సవరణకు అవకాశం కల్పించారు. మే 3, 4, 5 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్ష ఉంటుంది. మే 8, 9 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
Read Also : విషాదం : పరీక్ష హాల్లో ఇంటర్ విద్యార్ధి దుర్మరణం
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు ప్రకటించారు.
ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 6 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, ఇతరులకు రూ. 800గా నిర్ణయించారు. రూ.1000 లేట్ ఫీజుతో ఏప్రిల్ 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 5వేల రూపాయలతో ఏప్రిల్ 24వ తేదీ వరకు, 10వేల రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 28వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర‍్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు.
Read Also : డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు వదిలిన లారీ డ్రైవర్