Telangana DSC Notification : తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు.. త్వరలోనే కొత్త నోటిఫికేషన్!
Telangana DSC Notification : తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు అయింది. అతి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ విడుదల కానుంది.
- Sreehari A
- Updated on- February 29, 2024 / 12:32 AM IST
telangana government cancelled dsc notification 2023 for New Notification
Telangana DSC Notification : తెలంగాణ డీఎస్సీ 2023 నోటిఫికేషన్‌ను కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రద్దు చేసింది. గత నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాదిలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది. అతి త్వరలో కొత్తగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలంగాణ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ వెల్లడించింది.
కొత్తగా దరఖాస్తు చేయాల్సిన పనిలేదు :
గతేడాది సెప్టెంబర్‌లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడా నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్కూల్ ఎడ్యుకుషన్ కమిషనర్ తెలిపారు.
గత దరఖాస్తులను కొత్త నోటిఫికేషన్ వర్తింపచేయనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. దాదాపు 11 వేల టీచర్ పోస్టులతో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. పాత నోటిఫికేషన్ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునేలా సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త నోటిఫికేషన్ విడుదల తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
