నిరుద్యోగుల కోసం తెలంగాణ హైకోర్టులో 1,539 ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. మొదటగా జారీ చేసిన నోటిఫికేషన్ లో సెప్టెంబర్ 4 దరఖాస్తుకు చివరి తేదీ అని ప్రకటించారు. అయితే ఇప్పుడు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 18 వరకు పొడిగించింది తెలంగాణ హైకోర్టు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హత:
అభ్యర్ధులు టెన్త్, ఇంటర్ పూర్తి చేయాలి. ప్రాసెస్ సర్వర్ పోస్టుకు 10వ తరగతి పాసైతే చాలు.
పోస్టులు:
ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనో, కాపీయిస్ట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్‌ఆర్డినేట్. సబ్ఆర్డినేట్
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్ధులు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST అభ్యర్ధులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 2, 2019.
దరఖాస్తు చివరితేది: సెప్టెంబర్ 18, 2019.
ఆన్ లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Read Also: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో.. అప్రెంటీస్ పోస్టులు