ప్లీజ్ చెక్ : తెలంగాణ పోలీస్ ఫిట్‌నెస్ టెస్ట్ ఫలితాలు

  • Publish Date - April 9, 2019 / 01:35 AM IST

తెలంగాణ పోలీసు శాఖలోని వివిధ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఫిట్ నెస్ టెస్ట్ ఫలితాలను టీఎస్ పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్‌ నియామకాల్లో తుది రాత పరీక్షలకు 1,17,660 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. 18,428 పోస్టుల భర్తీకి ఫిట్ నెస్ టెస్టులు నిర్వహించారు. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన 2,24,741 మంది అభ్యర్థులకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,17,660 మంది తుది రాత పరీక్షలకు ఎంపికయ్యారు. వీరిలో.. 89,634 మంది పురుషులు, 28,026 మంది స్త్రీలు ఉన్నారు. SI పోస్టులకు 56వేల 106 మంది,  ASI(FPB) కి 1,218మంది, కానిస్టేబుల్ పోస్టులకు లక్ష 13వేల 929 మంది క్వాలిఫై అయ్యారు.

ఫిట్ నెస్ పరీక్షకు హాజరైన వారిలో 52శాతం మంది తుదిరాత పరీక్షకు అర్హత సాధించడం తెలుగు రాష్ట్రాల పోలీస్‌ నియామక చరిత్రలో ఇదే మొదటి సారి అంటున్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు కేటగిరీల వారీగా బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.inలో ఉంచినట్లు పోలీసు నియామక మండలి చైర్మన్‌ వీవీ శ్రీనివా‌సరావు తెలిపారు. ఏప్రిల్‌ 20 నుంచి ప్రారంభం కానున్న తుది రాత పరీక్షలకు సంబంధించిన హాల్‌ టిక్కెట్లను త్వరలో వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..