జీతం 28వేలు : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 01:23 AM IST
జీతం 28వేలు : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు

Updated On : January 6, 2020 / 1:23 AM IST

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జనవరి 6 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులను రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

విద్యార్హత: 
అభ్యర్థులు డిగ్రీ (ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ సైన్స్, వెటర్నరీ సైన్సెస్, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు ఆగస్ట్ 1, 2019 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

Read Also..చెక్ ఇట్: ఢిల్లీ మెట్రో ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు

దరఖాస్తు ఫీజు: 
అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.200, పరీక్ష ఫీజు రూ.80 కలిపి మొత్తం 280 చెల్లించాలి. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ST, SC, BC, దివ్యాంగులు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ST, SC, BC, దివ్యాంగులకు ఫీజు నుంచి ఎలాంటి మినహాయింపు వర్తించదు.

రాతపరీక్ష విధానం:
> పరీక్ష మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు.
> పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి, పేపర్ 2లో అభ్యర్థికి సంబంధించిన విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు.
> పేపర్ 1 పరీక్ష తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. పేపర్ 2 పరీక్ష కేవలం ఇంగ్లిష్‌ లోనే ఉంటుంది.