Tesla seeks applications
Tesla Jobs in India : అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లోకి అడుగుపెట్టబోతుంది. ఇటీవలే అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిలియనీర్, టెస్లా బాస్ ఎలన్ మస్క్ మధ్య సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం అనంతరం భారత మార్కెట్లో భారీగా నియమాకాలను చేపట్టనున్నట్టు టెస్లా ప్రకటించింది.
వచ్చే ఏప్రిల్ నుంచి భారత్‌లోకి టెస్లా కారు ఎంట్రీ ఇవ్వనుంది. భారతీయుల కోసం మస్క్ కంపెనీ టెస్లా మోటార్స్ 13 రోల్స్ కోసం ఉద్యోగాలను ఆఫర్ చేస్తోంది. ఇందులో సేల్స్ అండ్ మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్, ఆపరేషన్స్, టెక్నికల్ విభాగాలకు నియమాకాలను కంపెనీ ప్రకటించింది. ఇందులో కస్టమర్ ఫేసింగ్, బ్యాక్-ఎండ్ వర్కింగ్ పోస్టులు ఉన్నాయి.
టెస్లా వెబ్‌సైట్ ప్రకారం.. పీసీబీ డిజైన్ ఇంజనీర్-ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఆఫీసు పూణేలో ఉంటుంది. మిగిలిన పోస్టుల ఉద్యోగుల పనిచేసే ప్రాంతమైన ముంబైలో ఉండనుంది. ఆసక్తిగల వారు టెస్లాలో ఉద్యోగం పొందాలంటే.. టెస్లా అధికారిక వెబ్‌సైట్ (Tesla.com)ను విజిట్ చేయాలి. ఆ తర్వాత మీరు ఆ 13 పోస్టులలో దేనికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు దరఖాస్తు ఎలా చేయాలి? ప్రాసెస్ ఏంటి అనేది పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు టెస్లాలో ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయొచ్చు :
పీసీబీ డిజైన్ ఇంజనీర్ : PCB డిజైన్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . ఈ పోస్ట్ కోసం మీకు ఆపరేషన్స్, బిజినెస్ సపోర్ట్ విభాగంలో 5 ఏళ్ల కన్నా ఎక్కువ అనుభవం ఉండాలి.
సర్వీస్ అడ్వైజర్ : సర్వీస్ అడ్వైజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. పైప్‌లైన్ వాహన బుకింగ్ నుంచి డెలివరీ, ఆదాయ గుర్తింపు వరకు మీరు ఈ పనులను నిర్వహించాల్సి ఉంటుంది.
స్టోర్ మేనేజర్ : స్టోర్ మేనేజర్ పోస్టుకు మీకు సేల్స్, కస్టమర్ సపోర్ట్ రంగంలో 8 ఏళ్ల కన్నా ఎక్కువ అనుభవం ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కన్స్యూమర్ ఎంగేజ్‌మెంట్ మేనేజ్ : మీరు టెస్లాలో కన్స్యూమర్ ఎంగేజ్‌మెంట్ మేనేజర్ రోల్ కావాలంటే మీకు సేల్స్, కస్టమర్ సపోర్టులో 7 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉండాలి.
కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ : కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ కోసం ఆఫర్ అందిస్తోంది. ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి, మీకు కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
టెస్లాలో మిగిలిన ఉద్యోగ ఖాళీలు :
టెస్లాలోని ఇతర పోస్టుల కోసం ఉద్యోగ ఖాళీలను చెక్ చేయడానికి మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు. ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది. వెహికల్ సర్వీసు, కస్టమర్ సపోర్టు, వ్యాపార కార్యకలాపాలు, అమ్మకాలు వంటి విస్తృత శ్రేణి విధుల కోసం నియమకాలను టెస్లో చేపడుతోంది. ఈ విస్తరణ దేశంలో సమగ్ర అమ్మకాలు, సేవ, మద్దతు నెట్‌వర్క్‌ను సృష్టించాలనేది టెస్లా లక్ష్యం.
ఆసక్తిగల అభ్యర్థులు టెస్లా అధికారిక వెబ్‌సైట్ లేదా లింక్డ్ఇన్ పేజీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా పోస్టులు పూర్తి సమయం, ముంబై లేదా ఢిల్లీలో ఉంటాయి. అభ్యర్థులు తమకు నచ్చిన పాత్రను ఎంచుకుని అవసరమైన వివరాలను నింపాలి. ఈ ఖాళీలకు అధిక డిమాండ్ ఉన్నందున, టెస్లా సంబంధిత అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం, ముఖ్యంగా కస్టమర్ సర్వీస్, సేల్స్, ఆటోమోటివ్ రంగాలలో వెతుకుతోంది. ఈ ఉద్యోగాల్లో మీకు జాబ్ కొడితే లక్షల్లో సంపాదించవచ్చు.