JioHotstar : జియో యూజర్లకు పండగే.. ఈ ప్లాన్‌‌తో జియోహాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ మీ సొంతం.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

JioHotstar Membership : జియో తమ యూజర్ల కోసం జియోహాట్‌‌స్టార్ ఉచితంగా సబ్‌స్ర్కిప్షన్ అందిస్తోంది. మీరు చేయాల్సిందిల్లా.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవడమే.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

JioHotstar : జియో యూజర్లకు పండగే.. ఈ ప్లాన్‌‌తో జియోహాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ మీ సొంతం.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

Reliance Jio is offering free JioHotstar

Updated On : February 19, 2025 / 5:14 PM IST

JioHotstar Membership : రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో జియో హాట్‌స్టార్ సభ్యత్వం ఉచితంగా పొందవచ్చు. ఇటీవలే జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లు విలీనమైన సంగతి తెలిసందే. వయాకామ్18, స్టార్ ఇండియా మధ్య విలీనం ద్వారా ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ఒకే యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.

Read Also : iQoo Neo 10R Launch : ఐక్యూ బడ్జెట్ గేమింగ్ ఫోన్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చుంటే?

కొత్త ప్లాట్‌ఫామ్ రెండు స్ట్రీమింగ్ సర్వీసుల నుంచి కంటెంట్‌తో పాటు అంతర్జాతీయ స్టూడియోల నుంచి వివిధ రకాల కంటెంట్ స్ట్రీమింగ్ అందిస్తోంది. జియో హాట్‌స్టార్‌ను నెలవారీ లేదా వార్షిక ప్లాన్‌ల ద్వారా సబ్‌స్క్రైబ్ చేసుకోగలిగినప్పటికీ, జియో వినియోగదారులు ఇప్పుడు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా ఫ్రీగా జియోహాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ యాక్సెస్‌ను పొందవచ్చు.

జియో హాట్‌స్టార్‌కు ఫ్రీగా యాక్సెస్‌ :
జియో అందించే రూ. 949 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. జియో హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్‌కు 90 రోజుల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS, ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. వినియోగదారులు రోజువారీ డేటా అలవెన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64kbpsకి తగ్గుతుంది.

జియో హాట్‌స్టార్ మొబైల్ ప్లాన్ ధర కేవలం రూ.149 మాత్రమే.. 3 నెలల వ్యాలిడీటీతో వస్తుంది. వినియోగదారులు ఒకేసారి ఒక మొబైల్ డివైజ్‌‌లో కంటెంట్‌ను వీక్షించవచ్చు. యాడ్స్ మాత్రం వస్తాయి. నేరుగా సభ్యత్వాన్ని పొందాలనుకునే యూజర్లు రూ.499కి వార్షిక సభ్యత్వం పొందవచ్చు. అయితే, ఈ రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకునే జియో కస్టమర్లు అదనపు చెల్లించకుండానే మొబైల్ సభ్యత్వాన్ని పొందుతారు.

ఫ్రీ సబ్ స్క్రిప్షన్ కోసం రీఛార్జ్ ఎంతంటే? :
జియో హాట్‌స్టార్ యాక్సెస్‌తో పాటు రూ.949 ప్లాన్ యూజర్లకు జియోటీవీ, జియోక్లౌడ్ వంటి జియో సర్వీసులను కూడా అందిస్తోంది. ఇప్పటికే జియో సినిమా లేదా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను ఉపయోగిస్తున్న సబ్‌స్క్రైబర్‌లు వారి ప్రస్తుత ప్లాన్‌లను గడువు ముగిసే వరకు యాక్సస్ చేయొచ్చు. ఆ తర్వాత వారు ఫ్రీగా సభ్యత్వం పొందడానికి జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయాలి. రూ.949 జియో ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి.

Read Also : iPhone SE 4 Launch : ఆపిల్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. చౌకైన ధరకే ఐఫోన్ SE 4 వచ్చేస్తోంది.. ఫీచర్లపైనే అందరి దృష్టి.. ఫుల్ డిటెయిల్స్..!

యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే యూజర్లు నేరుగా సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాలి. జియో హాట్‌స్టార్ నెలకు రూ.499 లేదా సంవత్సరానికి రూ.1,499 ధరకు ప్రీమియం ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ వీడియో క్వాలిటీ (4K) మల్టీ డివైజ్‌ల్లో (ఒకేసారి 4 స్క్రీన్‌లు) స్ట్రీమ్ చేయొచ్చు. సూపర్ జియో హాట్‌స్టార్ ప్లాన్ కూడా ఉంది.

యాడ్-సపోర్ట్ ప్యాక్, డ్యూయల్ స్క్రీన్‌లకు సపోర్టు అందిస్తుంది. మీరు ఒకేసారి రెండు డివైజ్‌ల్లో కంటెంట్‌ను చూడగలరు. మొబైల్, వెబ్, టాబ్లెట్‌లు, టీవీలు, ఇతర డివైజ్‌ల్లో కూడా కంటెంట్‌ను వీక్షించవచ్చు. 3 నెలల జియో హాట్‌స్టార్ సూపర్ ప్లాన్ రూ. 299, వార్షిక ప్లాన్ ధర రూ. 899కు అందుబాటులో ఉన్నాయి.