iQoo Neo 10R Launch : ఐక్యూ బడ్జెట్ గేమింగ్ ఫోన్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చుంటే?
iQoo Neo 10R Launch : మార్చి 11న భారత మార్కెట్లో ఐక్యూ నియో 10R లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ, ఛార్జింగ్, డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..

iQoo Neo 10R Launch
iQoo Neo 10R Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఐక్యూ నెక్స్ట్ బడ్జెట్ గేమింగ్ త్వరలో రానుంది. కంపెనీ ప్రకారం.. మార్చి 11న భారత మార్కెట్లో (iQoo Neo 10R 5G) లాంచ్ కానుంది.
లాంచ్‌కు ముందే కంపెనీ ఛార్జింగ్ స్పెసిఫికేషన్‌లను టీజ్ చేసింది. ఇటీవల షేర్ చేసిన టీజర్‌లో నియో 10R 5జీ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ కలిగి ఉంటుందని ఐక్యూ వెల్లడించింది. గత మోడల్ (iQoo Neo 9 Pro 5G) 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఐక్యూ నియో 10ఆర్ 5జీ ఫోన్ అమెజాన్ ఇండియా, ఐక్యూ అధికారిక ఇండియా వెబ్‌సైట్ ద్వారా ప్రత్యేకంగా విక్రయానికి అందుబాటులో ఉంటుందని అదే టీజర్ వెల్లడించింది.
ఐక్యూ నియో 10ఆర్ స్పెషిఫికేషన్లు (అంచనా) :
రాబోయే ఐక్యూ నియో 10R 5జీ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో రానుందని కంపెనీ ప్రకటించింది.
భారత మార్కెట్లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్‌ను కలిగిన ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో రియల్‌మి జీటీ6, పోకో ఎఫ్6, హానర్ 200 ప్రో ఉన్నాయి. ఐక్యూ కూడా నియో 10ఆర్ 5జీ ఫోన్ భారత మార్కెట్లో ప్రత్యేకమైన ర్యాగింగ్ బ్లూ అనే కలర్ ఆప్షన్ విక్రయించనున్నట్లు ధృవీకరించింది. కంపెనీ నుంచి లేటెస్ట్ టీజర్ పరిశీలిస్తే.. ఈ ఫోన్ మరింత అడ్వాన్స్‌డ్ డస్టీ-గోల్డెన్ కలర్ వేరియంట్‌ను సూచిస్తుంది.
డిజైన్ విషయానికొస్తే.. :
డిజైన్ పరంగా పరిశీలిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సర్వసాధారణంగా ఉన్న స్క్వోవల్ కెమెరా మాడ్యూల్ ఉండనుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో డ్యూయల్-కెమెరా సెటప్‌ను అందించనుంది. కెమెరా మాడ్యూల్ కుడి వైపున చిన్న ఎల్ఈడీ ఫ్లాష్‌ను కూడా గమనించవచ్చు. నియో 10ఆర్ 5జీ ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్‌లను ఐక్యూ కంపెనీ ఇంకా నిర్ధారించలేదు.
ఈ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ వైడ్-యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. లీక్‌లు కూడా ఐక్యూ నియో 10R ఫోన్ 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 1.5K ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సూచిస్తున్నాయి. నివేదిక ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌కు 6,400mAH బ్యాటరీని అందించనున్నారు.
ధర ఎంత ఉండొచ్చుంటే? :
ఐక్యూ నియో 10R ధర విషయానికొస్తే.. ఈ ఫోన్ అధికారికంగా లాంచ్ అయిన తర్వాత మాత్రమే ఫైనల్ ధర ఏంటో తెలుస్తుంది. అయితే, ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఉన్న చాలా స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 3 స్మార్ట్‌ఫోన్‌ల ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఐక్యూ నియో 10ఆర్ ఫోన్ రూ.30వేల కన్నా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.