తెలంగాణలో మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్లను bse.telangana.gov.inలో అందుబాటులో ఉంచారు. పరీక్షలు రాసే విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
హాల్‌టికెట్లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి కూడా విద్యార్థులు తీసుకోవచ్చని చెప్పారు. అలాగే, ఎగ్జామ్స్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే 040-23230942 నంబరుకు ఫోన్ చేసి చేయాలని సూచించారు.
దీనికోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రతి పాఠశాలకూ హాల్‌టికెట్లను పంపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి హాల్‌టికెట్లను తప్పకుండా తీసుకువెళ్లాల్సిందే.
కాగా, తెలంగాణలో పదో తరగతి ప్రధాన సబ్జెక్టుల ఎగ్జామ్స్ వచ్చేనెల 2న ముగుస్తాయి. అనంతరం 3, 4వ తేదీల్లో ఓరియంటల్ సబెక్టులకు గానూ ఎగ్జామ్స్ ఉంటాయి. సైన్స్ పరీక్షలు మినహా మిగిలిన పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగుతాయి.
సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ) పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11 గంటల మధ్య ఉంటాయి. గ్రేడింగ్ విధానాన్ని తొలగించి మార్కుల విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది.
హాల్‌టికెట్లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు