10th Exams: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా పరీక్ష కేంద్రానికి ఇలా చేరుకోండి..

పరీక్ష కేంద్రాలకి వెళ్లడానికి మాత్రమే కాదు.. పరీక్ష రాసి ఇంటికి తిరిగి వచ్చే సమయంలోనూ..

10th Exams: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా పరీక్ష కేంద్రానికి ఇలా చేరుకోండి..

Updated On : March 8, 2025 / 12:46 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. విద్యార్థులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పరీక్షా కేంద్రానికి చేరుకునే అవకాశం ఉంది. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటన చేశారు.

మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఉచిత బస్సు సౌకర్యాన్ని పొందేందుకు తమ హాల్‌ టికెట్‌ను కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది. పల్లె వెలుగుతో పాటు ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.

Also Read: అరె బాప్‌రే.. భారత్‌లో తగ్గిన బంగారం డిమాండ్‌.. విశ్లేషకులు ఏమంటున్నారో తెలుసా?

బస్సుల్లో ఫ్రీగా పరీక్ష కేంద్రం స్టాపు వరకు వెళ్లవచ్చు. పరీక్ష కేంద్రాలకి వెళ్లడానికి మాత్రమే కాదు.. పరీక్ష రాసి ఇంటికి తిరిగి వచ్చే సమయంలోనూ ఈ సౌకర్యాన్ని ఫ్రీగా పొందవచ్చని ఆర్టీసీ అధికారులు వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 6.49 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. ఇందుకోసం 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే సంబంధిత అధికారులు ప్రకటించారు. హాల్ టికెట్లను వెబ్‌సైట్‌, వాట్సప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని విద్యాశాఖ చెప్పింది.

బీఎస్ఈ ఏపీ వెబ్ సైట్ లేదా ప్రభుత్వ వాట్సాప్ సేవల ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు పరీక్షల వేళ ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, ధ్యానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకుంటే ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు.