Gold: అరె బాప్‌రే.. భారత్‌లో తగ్గిన బంగారం డిమాండ్.. విశ్లేషకులు ఏమంటున్నారో తెలుసా?
దీనివల్ల కొత్తగా కొనుగోలు చేయడానికి వారు అంతగా ఆసక్తి చూపడం లేదని కోల్‌కతాలోని జేజే గోల్డ్ హౌస్ హోల్‌సేలర్ హర్షద్ అజ్మేరా తెలిపారు.

భారత్‌లో బంగారం ధరలు ఈ వారంలో పెరగడం వల్ల దాని డిమాండ్ తగ్గిపోయింది. అలాగే ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో బంగారం వ్యాపారులు తమ ఆర్థిక లావాదేవీలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఆడిట్ పనుల్లో తలామునకలై ఉంటారు. దీనివల్ల కొత్తగా కొనుగోలు చేయడానికి వారు అంతగా ఆసక్తి చూపడం లేదని కోల్‌కతాలోని జేజే గోల్డ్ హౌస్ హోల్‌సేలర్ హర్షద్ అజ్మేరా తెలిపారు.
ఇండియాలో గత నెలలో రికార్డు స్థాయిలో రూ.86,592ను తాకిన 10 గ్రాముల బంగారం ధర.. ఈ రోజు రూ.85,860 వద్ద ట్రేడయ్యింది. భారత అధికారిక ధరలతో (6% దిగుమతి పన్ను, 3% విక్రయ పన్ను సహా) పోల్చితే.. ఈ వారం భారత డీలర్లు ఔన్స్‌కు $10 నుండి $21 వరకు తగ్గింపును అందిస్తున్నారు. అంటే అధికారిక ధర కన్నా తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. గత వారం ఇది $12 నుంచి $27 మధ్య కొనసాగింది.
మార్కెట్ చాలా స్తబ్ధుగా ఉంది, బ్యాంకులు బంగారాన్ని తీసుకురావడం లేదని, సరఫరాలు తగ్గిపోయాయిని ముంబైకి చెందిన ఓ బులియన్ ఇంపోర్ట్ బ్యాంక్ డీలర్ పేర్కొన్నారు.
Also Read: షాకింగ్.. బంగారం ధరలు ఇక పెరుగుతూనే ఉంటాయి.. ఎందుకంటే..: వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈవో
సింగపూర్‌లో బంగారం $0.50 తగ్గింపుతో $3 ప్రీమియం మధ్య ట్రేడ్ అయింది. మార్కెట్ అస్థిరంగా ఉన్నంతకాలం కొంతమంది వినియోగదారులు కొనుగోలు కోసం ముందుకు వస్తారు. అయితే గత వారం కంటే డిమాండ్ తక్కువగా ఉందని గోల్డ్‌సిల్వర్ సెంట్రల్ మేనేజింగ్ డైరెక్టర్ బ్రియన్ లాన్ తెలిపారు.
చైనా మార్కెట్‌లో బంగారం స్పాట్ ధరల కంటే $1 నుండి $3 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. బంగారంలో అంచనాలు బలంగా ఉండడం వల్ల చైనాలో దీర్ఘకాల పెట్టుబడి కోసం ప్రజలు బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీని ఫలితంగా చైనా బంగారం నిల్వలు ఫిబ్రవరి చివరి నాటికి 73.61 మిలియన్ ఫైన్ ట్రాయ్ ఔన్స్‌కు పెరిగాయి.
బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, అలాగే రాజకీయ అస్థిరత వంటి అంశాల వల్ల ప్రభావితమవుతాయి. అందుకే పెట్టుబడిదారులు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా విశ్లేషించి నిర్ణయం తీసుకుంటారని, ధరలు తగ్గినప్పుడు, బంగారం మరింత అందుబాటులోకి రావడంతో పెట్టుబడిదారులు, వినియోగదారులు కొనుగోలు పెంచడం వల్ల బంగారం దాని సంప్రదాయ విలువను నిలుపుకుందని ఆర్థిక విశ్లేషకుడు రాస్ నార్మన్ పేర్కొన్నారు.