TGPSC : గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాలపై టీజీపీఎస్సీ కీలక ప్రకటన..

ఈ నెల 19న ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ ఫైనల్‌ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామంది.

TGPSC : గ్రూప్స్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బిగ్ అప్ డేట్ ఇచ్చింది టీజీపీఎస్సీ. గ్రూప్స్ పరీక్షల ఫలితాలకి సంబంధించి షెడ్యూల్ ను టీజీపీఎస్సీ ప్రకటించింది. ముందుగా ఈ నెల 10న గ్రూప్-1 ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ నెల 11న గ్రూప్‌-2 ర్యాంకులు ప్రకటించనుంది. 14వ తేదీన గ్రూప్‌-3 ర్యాంకుల జాబితా ప్రకటించనుంది టీజీపీఎస్సీ.

Also Read : ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే చాలు.. నెలకు రూ.56వేలపైనే జీతం..

ఇక, మార్చి 17న హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఫైనల్‌ రిజల్ట్స్ ప్రకటిస్తామని చెప్పింది. ఈ నెల 19న ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ తుది ఫలితాలు అనౌన్స్ చేస్తామంది. కాగా, ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే 99667 00339 నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని టీజీపీఎస్సీ కోరింది.