Indian Army : ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే చాలు.. నెలకు రూ.56వేలపైనే జీతం..

Indian Army : ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు పడ్డాయి. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 2025 ద్వారా మహిళలు, పురుషులు లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగంలో చేరవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Indian Army : ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే చాలు.. నెలకు రూ.56వేలపైనే జీతం..

Indian Army NCC Special Entry

Updated On : March 6, 2025 / 4:24 PM IST

Indian Army : భారత ఆర్మీలో ఉద్యోగాలు పడ్డాయి. ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే చాలు.. ఉద్యోగంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 2025 ద్వారా మహిళలు, పురుషులు
లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీ ఉద్యోగంలో చేరవచ్చు. అర్హతలు, ఎంపిక విధానం, శిక్షణ వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొత్తం 76 ఖాళీలు ఉన్నాయి.

Read Also : PM Kisan 20th Installment : పీఎం కిసాన్ రైతులకు కొత్త అప్‌డేట్.. 20వ విడత డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి పడేది ఎప్పుడంటే?

అర్హతలివే :
కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేయాలి
ఎన్‌సీసీ ‘C’ సర్టిఫికేట్‌లో బి-గ్రేడ్
వయసు : 19 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య (జూలై 2, 2000 నుంచి జూలై 1, 2006)లో జన్మించాలి

ఎంపిక ప్రక్రియ :
అకడమిక్ మార్కులతో దరఖాస్తుల పరిశీలన చేసి షార్ట్‌లిస్టింగ్ చేస్తారు.
బెంగళూరులో రెండు దశల్లో 5 రోజుల పాటు ఇంటర్వ్యూలు
ఇంటర్వ్యూలో ఎంపికైనవారికి మెడికల్ టెస్టులు

ట్రైనింగ్, వేతనం :
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ 49 వారాల ట్రైనింగ్
ట్రైనింగ్ సమయంలో నెలకు స్టైపెండ్ రూ. 56,100 పొందవచ్చు.
ట్రైనింగ్ తర్వాత లెఫ్టినెంట్ హోదాతో జాబ్‌లో జాయిన్ కావొచ్చు.

Read Also : Xiaomi Holi Sale : షావోమీ హోలీ సేల్ ఆఫర్లు.. ఈ రెడ్‌మి 5జీ ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. తక్కువ ధరకే కొనేసుకోండి!

జీతం, అలవెన్సులు :
వార్షిక రూ. 17లక్షల నుంచి రూ. 18 లక్షల సీటీసీ
మిలటరీ పే, డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర ప్రయోజనాలు

దరఖాస్తు ప్రక్రియ :
దరఖాస్తుకు లాస్ట్ డేట్ : మార్చి 15, 2025
అధికారిక వెబ్‌సైట్ (indianarmy.nic.in) ద్వారా అప్లయ్ చేయొచ్చు.