TG EAPCET Counselling: టీజీ ఈఏపీసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్.. వెబ్ ఆప్షన్స్ కి రేపే లాస్ట్ డేట్.. పూర్తి వివరాలు మీకోసం
TG EAPCET Counselling: తెలంగాణ ఈఏపీసెట్ 2025 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.

Tomorrow is the last date for TG EAPSET second phase counseling web option.
తెలంగాణ ఈఏపీసెట్ 2025 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ్టి (జులై 26) నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియ రేపటితో అంటే జూలై 27తో ముగియనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tgeapcet.nic.in/Default.aspx ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే జూలై 27న వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ అందుబాటులోకి రానుంది. అనంతరం జూలై 30వ తేదీ లోపు సీట్ల కేటాయింపు జరుగుతుంది.
సీట్లు పొందిన అభ్యర్థులు జులై 30 నుంచి ఆగస్టు 1 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. అలాగే జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో వ్యక్తిగతంగా రిపోర్టింగ్ చేసుకోవాలి. చేయకపోతే సీటు క్యాన్సిల్ అవుతుంది. ఇక టీజీ ఈఏపీసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఇటీవలే పూర్తయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 94,059 సీట్లకు గాను 77,561 సీట్లను మాత్రమే కేటాయించారు. వారిలో 59,980 మంది మాత్రమే ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవడం గమనార్హం.