TS EAPCET 2024 : తెలంగాణ ఎంసెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పరీక్ష తేదీలు ఇవే, ఎలా అప్లయ్ చేసుకోవాలంటే?

TS EAPCET 2024 : తెలంగాణ ఎంసెట్ 2024 పరీక్ష కోసం ఈ రోజు (ఫిబ్రవరి 26) నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు ఎలా చేసుకోవాలి? పరీక్ష తేదీ, ఫీజు చెల్లించడం వంటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

TS EAMCET 2024 registration starts today: Check exam dates, other details

TS EAPCET 2024 : తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) 2024 కోసం దరఖాస్తు ప్రక్రియ ఈరోజు (ఫిబ్రవరి 26) నుంచి ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు అండ్ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, అనుబంధ ప్రొఫెషనల్ కాలేజీలలో 2024-25 విద్యా సంవత్సరానికి అందించే అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం కోసం టీఎస్ ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు.

Read Also : AP-TET Hall Ticket Download 2024 : ఏపీ టెట్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. ఈ లింక్ ద్వారా ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!

ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక (eapcet.tsche.ac.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఏప్రిల్ 6, 2024 దరఖాస్తు సమర్పణకు చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తులో ఏదైనా తప్పులు ఉంటే సవరించుకునేందుకు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 12 వరకు అనుమతి ఉంటుంది. టీఎస్ ఎంసెట్ పరీక్ష హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి మే 1, 2024న అందుబాటులో ఉంటుంది.

టీఎస్ ఎంసెట్ 2024 దరఖాస్తు ఫీజు :
ఈ సంవత్సరం తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET)ని తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ (TS EAPCET)గా మార్చిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం.. ఇంజినీరింగ్ పరీక్షకు హాజరయ్యే SC/ST అభ్యర్థులు తప్పనిసరిగా రూ.500, ఇతర కేటగిరీ అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష కోసం, SC/ST అభ్యర్థులు తప్పనిసరిగా రూ.500, ఇతరులు (జనరల్) రూ.900 చెల్లించాలి. రెండు కోర్సులకు హాజరయ్యే SC/ST వర్గానికి చెందిన అభ్యర్థులు రూ.1000, ఇతరులు రూ.1800 చెల్లించాలి.

ఎంసెట్ పరీక్ష తేదీలు ఇవే :
టీఎస్ ఎంసెట్ 2024ని (TSCHE) తరపున హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ నిర్వహిస్తుంది. (TS EAPCET-2024) పరీక్ష కంప్యూటర్ ఆధారిత (CBT) మోడ్‌లో 3 గంటల పాటు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ పరీక్షకు పరీక్ష తేదీ మే 9, మే 10 తేదీల్లో నిర్వహిస్తారు. అగ్రికల్చర్, ఫార్మసీ పేపర్లకు పరీక్ష మే 11, మే 12 తేదీల్లో జరుగుతుంది. ఇంజినీరింగ్ పేపర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ పేపర్ల పరీక్షలను మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.

టీఎస్ ఎంసెట్ 2024 : రిజిస్ట్రేషన్ ముఖ్యమైన తేదీలు :

  • ఫిబ్రవరి 26 నుంచి ఎంసెంట్ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం
  • ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ : ఏప్రిల్ 6
  • టీఎస్ ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ – ఏప్రిల్ 8 నుంచి 12 ఏప్రిల్ వరకు
  • రూ. 250 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 9.
  • రూ. 500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 14.
  • రూ. 2,500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 19 ఏప్రిల్ 2024.
  • రూ. 5,000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ 4 మే 2024.

టీఎస్ ఎంసెట్ 2024 కోసం దరఖాస్తు ఎలా చేయాలి? :

  • అధికారిక (eapcet.tsche.ac.in) వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • రిజిస్ట్రేషన్ లింక్‌ క్లిక్ చేసి అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, లాగిన్ ద్వారా మీ అకౌంట్ యాక్సెస్ చేయండి.
  • హోమ్‌పేజీలో దరఖాస్తు ఫారమ్‌ను నింపిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
  • మీ పూర్తి వివరాలను దరఖాస్తుల నింపిన తర్వాత అప్లికేషన్ సమర్పించండి
  • చివరిగా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

టీఎస్ ఎంసెట్ 2024 : అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ :
ఎంసెట్ అభ్యర్థులు మే 1న eapcet  అధికారిక వెబ్‌సైట్ నుంచి నుంచి హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Read Also : UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

ట్రెండింగ్ వార్తలు