TS EAMCET-2022 : తెలంగాణ ఎంసెట్‌ హాల్‌‌టికెట్లు.. డౌన్‌లోడ్ చేసుకున్నారా?

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

TS EAMCET-2022 : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షల హాల్ టికెట్లు శనివారం (జూన్ 25) రిలీజ్ అయ్యాయి. వచ్చే జూలైలో ఎంసెట్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో వెల్లడించింది. జూలై 11 వరకు ఎంసెట్ హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంటాయి. జూలై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడిసిన్‌ కు సంబంధించి పరీక్షలు, అలాగే జూలై 18, 19, 20 వరకు ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ పరీక్షలు జరుగనున్నాయి. ఎంసెట్ పరీక్షల దరఖాస్తుల ప్రక్రియ ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ మే 28తో గడువు ముగియనుంది. ఆలస్యంగా ఫీజు చెల్లిస్తే.. జూలై 7 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

Ts Eamcet Hall Ticket 2022, How To Download From Eamcet

అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in విజిట్ చేయాలి. హోంపేజ్‌లోకి వెళ్లండి. అక్కడ మీకు ఎంసెట్ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ నమోదు చేసి సబ్మిట్ చేయాలి. స్క్రీన్‌పై మీ హాల్‌టికెట్ కనిపిస్తుంది.

మీరు ఇచ్చిన వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. వెంటనే మీరు డౌన్‌లోడ్ చేసిన హాల్ టికెట్‌ను ప్రింట్ ఔట్ తీసుకుని ఫ్యూజర్ రిఫరెన్స్ కోసం దగ్గర ఉంచుకోండి. మీరు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల సమయంలో ఈ హాల్ టికెట్ అవసరం పడొచ్చు.

Read Also : TS EAMCET: జులై 14 నుంచి తెలంగాణ ఎంసెట్

ట్రెండింగ్ వార్తలు