TS TET 2025 Exam Schedule Released
TS TET 2025 Exam Schedule : తెలంగాణ ఉపాధ్యాయుల అర్హత పరీక్ష లేదా టీఎస్ టెట్ 2025 సబ్జెక్ట్ వారీ పరీక్ష షెడ్యూల్‌ను తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. టీఎస్ టెట్ పరీక్షలు జనవరి 2 నుంచి జనవరి 20 వరకు రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు. మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహిస్తారు.
ఈసారి టెట్‌కు దాదాపు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్ టెట్ 2025 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు (tgtet2024.aptonline.in) అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి టైమ్‌టేబుల్‌ను చెక్ చేయవచ్చు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.
ఒకటో తరగతి నుంచి 5 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే అభ్యర్థులు పేపర్ I ఎంచుకోవచ్చు. 6వ తరగతి నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే వారు పేపర్ II ఎంచుకోవచ్చు. టీఎస్ టెట్ 2025 అడ్మిట్ కార్డ్‌లు డిసెంబర్ 26, 2024న విడుదల అవుతాయి. టెట్ ఫలితాలు ఫిబ్రవరి 5న విడుదల కానున్నాయి.
TS TET 2025 అడ్మిట్ కార్డ్: డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
జనరల్ కేటగిరీ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఉత్తీర్ణత 40 శాతంగా ఉండాలి.
గతంలో టీఎస్ టెట్ సర్టిఫికేషన్‌కు ఏడేళ్ల వ్యాలిడిటీ ఉండగా ఇప్పుడు లైఫ్ టైమ్ చెల్లుబాటు అవుతుంది. టీచర్ ఉద్యోగాల భర్తీలో టెట్‌లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఇకపై ప్రతి సంవత్సరం టెట్‌ను నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
Read Also : UPI QR Code Scams : ఆన్‌లైన్ పేమెంట్లకు యూపీఐని వాడుతున్నారా? క్యూఆర్ కోడ్ స్కామ్‌లను ఎలా నివారించాలంటే?