Tspecet 2021
TSPECET 2021 Exam : TSPECET ఫలితాలు విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 2021, నవంబర్ 01వ తేదీ సోమవారం మధ్యాహ్నం 03 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్. లింబాద్రి, పీఈసెట్ ఛైర్మన్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గోపాల్ రెడ్డి ఫలితాలను ప్రకటించనున్నారు.
Read More : Puneeth Rajkumar : పెళ్లి మండపంలో పునీత్ కి నివాళులు అర్పించిన కొత్తజంట
యూజీడీపీఈడీ (UGDPED), బీపీఈడీ (BPED) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పీఈసెట్ నిర్వహించానున్నారనే సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంా..పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ఎగ్జామ్ ను నిర్వహించారు. అభ్యర్థులు ఫలితాలను https://pecet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని వర్సిటీ అధికారులు వెల్లడించారు.