TS SPDCL లో 3 వేల ఉద్యోగాలు

  • Publish Date - October 26, 2019 / 07:49 AM IST

తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) లో జూనియర్ లైన్ మన్ (JLM), జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ (JACO) అండ్ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (JPO) ఉద్యోగాల భర్తీకి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు: 
జూనియర్ లైన్‌మన్ పోస్టులు – 2500.
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ – 500.
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ – 25.
మొత్తం ఖాళీలు – 3025.

విద్యార్హతలు : 
అభ్యర్ధులు B.A, B.Com, B.Sc. Degree పాస్ కావాల్సి ఉంటుంది. 

వయోపరిమితి: 
అభ్యర్ధులు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి. 

దరఖాస్తు ఫీజు : 
అప్లికేషన్ ఫీజు – రూ.100
పరీక్ష ఫీజు – రూ.120

ముఖ్యమైన్ తేదిలు: 

> జూనియర్ లైన్‌మన్ అండ్ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ఫీజు చెల్లించడానికి చివరితేది: నవంబర్ 10, 2019.
పరీక్ష తేది: డిసెంబర్ 15, 2019.

> జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్  ఫీజు చెల్లించడానికి చివరితేది: నవంబర్ 20, 2019.
పరీక్ష తేది: డిసెంబర్ 22, 2019.