UBI Recruitment: UBI has released a notification for the posts of Specialist Officer.
UBI Recruitment: బ్యాంకింగ్ రంగంలో జాబ్ చేయాలనుకుంటున్న వారికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే వెల్త్ మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల(UBI Recruitment)ను భర్తీ చేయనుంది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 28తో అంటే రేపటితో ముగియనుంది. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.unionbankofindia.co.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే, బ్యాంకు నిబంధన ప్రకారం జాబ్ లో జాయిన్ అయ్యాక కనీసం రెండు సంవత్సరాల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లోనైనా జాబ్ మానేస్తే రూ.2,50,000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
విద్యార్హత:
అభ్యర్థులు ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడీబీఏ, పీజీడీబీఎమ్, పీజీపీఎం/పీజీడీఎమ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలాగే, బ్యాంకులు, బ్రోకింగ్ కంపెనీలు/అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో కనీసం 3 సంవత్సరాల పని చేసిన అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2025 ఆగస్ట్ 1 నాటికి కనీసం 25 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా 35 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము:
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన అభ్యర్థులు రూ.177, ఇతర కేటగిరీ అభ్యర్థులు రూ.1180 చెల్లించాల్సి ఉంటుంది.
పరిక్ష విధానం:
ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్. రెండవ భాగంలో అభ్యర్థి ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్.