UPSC Civil Services Exam 2023 Interview Schedule For Phase 3 Announced
UPSC Civil Services Exam 2023 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2023 ఇంటర్వ్యూ కోసం షెడ్యూల్‌ను ప్రకటించింది. దీనిప్రకారం.. 3వ దశ ఇంటర్వ్యూలు 817 మంది అభ్యర్థులకు మార్చి 18 నుంచి ఏప్రిల్ 9, 2024 వరకు నిర్వహించనుంది. కమిషన్ జారీ చేసిన నోటీసులో రోల్ నంబర్లు, తేదీలు, ఇంటర్వ్యూ సెషన్‌లు ఉన్నాయి. ముందస్తు సెషన్‌లో అభ్యర్థులు ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం సెషన్‌లో ఒంటి గంట సమయం వరకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
Read Also : UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
అధికారిక ప్రకటన ప్రకారం.. 817 మంది అభ్యర్థుల పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూలు) కోసం ఇ-సమన్ లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కమిషన్ వెబ్‌సైట్‌లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అయితే, పర్సనాలిటీ టెస్ట్ తేదీ, సమయం మాత్రం మారదు. పేర్కొన్న గడువులోపు (DAF-II)ని సమర్పించడంలో విఫలమైన అభ్యర్థులు వారి అభ్యర్థిత్వం రద్దు అవుతుంది.గతంలో సూచించిన విధంగా ఇ-సమన్ (e-Summon) లెటర్ వారికి జారీ కాదని గమనించాలి.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఇంటర్వ్యూ షెడ్యూల్ డౌన్‌లోడ్ చేసుకోండిలా :