UPSC 2022 : ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల, పూర్తి వివరాలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఎగ్జామ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. 2021, ఆగస్టు 14వ తేదీ శనివారం విడుదల చేసిన క్యాలెండర్ లో పరీక్ష తేదీలను వెల్లడించింది. కొత్త క్యాలెండర్ ప్రకారం..సివిల్ సర్వీసెస్ (మెయిన్) 2021 పరీక్షలను 2022, జనవరి 07, 08, 09, 15, 16వ తేదీల్లో నిర్వహించనున్నారు.

UPSC 2022 : ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల, పూర్తి వివరాలు

Upsc

Updated On : August 14, 2021 / 1:42 PM IST

UPSC Exam : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఎగ్జామ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. 2021, ఆగస్టు 14వ తేదీ శనివారం విడుదల చేసిన క్యాలెండర్ లో పరీక్ష తేదీలను వెల్లడించింది. కొత్త క్యాలెండర్ ప్రకారం..సివిల్ సర్వీసెస్ (మెయిన్) 2021 పరీక్షలను 2022, జనవరి 07, 08, 09, 15, 16వ తేదీల్లో నిర్వహించనున్నారు.

Read More : Bharath-Pak : అట్టారీ-వాఘా సరిహద్దుల్లో స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ సైనికులు

ఇండియాన్ ఫారెస్టు సర్వీస్ (మెయిన్) 2021 పరీక్షను 2022 ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభం కానుంది. ఈ పరీక్ష మార్చి 08 వరకు పది రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ సర్వీసెట్ (ప్రిలిమ్స్) ఎగ్జామ్, కంబైన్డ్ జియో – సైంటిస్టు (ప్రిలిమ్స్) ఎగ్జామ్ ఫిబ్రవరి 20వ తేదీన జరుగనుంది.

NDA, NA పరీక్ష (1), CDS ఎగ్జామ్ (1)ను 2022, ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించనున్నారు. ఇక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్స్ ఎగ్జామ్) ను 2022, నవంబర్ 20న నిర్వహించనున్నారు. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ను 2020, జులై 17వ తేదీన జరుగనుంది.

Read More : Trisha Kar Madhu: నటి ప్రైవేట్ వీడియో లీక్ అయిందా.. చేశారా?

AnnalPrg-Exam-RT-2022-engl-130821_0