UPSC Postpones Engineering Services Examination 2025
ESE Registration Reopen : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2025కి సంబంధించిన ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE) ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలను వాయిదా వేసింది. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (IRMS)కి రిక్రూట్‌మెంట్ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలు, ఈఎస్ఈ రెండింటి ద్వారా జరుగుతాయి. అధికారిక నోటీసు ప్రకారం.. ఇప్పుడు ప్రిలిమినరీ పరీక్ష జూన్ 8, 2025న మెయిన్ పరీక్ష ఆగస్టు 10, 2025న నిర్వహించనున్నారు.
“ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (IRMS)కి రిక్రూట్‌మెంట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ (ట్రాఫిక్, అకౌంట్స్, పర్సనల్ సబ్-క్యాడర్) ఈఎస్ఈ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిగ్నల్ & టెలికమ్యూనికేషన్) రెండింటి ద్వారా నిర్వహించనున్నట్టు ప్రభుత్వం నిర్ణయించింది. స్టోర్స్ సబ్-క్యాడర్లు.. రైల్వే మంత్రిత్వ శాఖ ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (సవరణ) రూల్స్, 2024 అక్టోబర్ 9, 2024న నోటిఫై చేసింది” అని నోటీసులో పేర్కొన్నారు.
కమిషన్ రిజిస్ట్రేషన్ గడువును అక్టోబర్ 18 నుంచి నవంబర్ 22 వరకు పెంచింది. రిజిస్ట్రేషన్ ద్వారా కొత్త దరఖాస్తుదారులు దరఖాస్తు చేయడమే కాకుండా పాత దరఖాస్తుదారులు తమ దరఖాస్తు ఫారమ్‌లో తప్పులు సరిదిద్దుకోవచ్చు. అంతేకాకుండా, దరఖాస్తుదారులందరికీ నవంబర్ 23 నుంచి నవంబర్ 29 వరకు 7 రోజుల కరెక్షన్/ఎడిట్ విండో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో వారు తమ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చునని నోటిఫికేషన్ పేర్కొంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 232 పోస్టులను భర్తీ చేయాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది.
యూపీఎస్సీ ఈఎస్ఈ 2025 దరఖాస్తు ఇలా చేయండి :