UCILTrade Apprentice : యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి 10వ తరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 18 - 25 సంవత్సరాలు లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

UCILTrade Apprentice

UCILTrade Apprentice : ప్రభుత్వ రంగ సంస్ధ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) జార్ఖండ్ లో పలు అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేపట్టనుంది. వివిధ ట్రేడ్‌లలో మొత్తం 243 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే ఫిట్టర్: 82, ఎలక్ట్రీషియన్: 82, వెల్డర్ 40, టర్నర్/ మెషినిస్ట్: 12, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్: 05, మెక్. డీజిల్/మెక్. MV: 12, కార్పెంటర్: 05, ప్లంబర్: 05 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Protecting Your Lungs : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి !

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి 10వ తరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 18 – 25 సంవత్సరాలు లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఐటిఐలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

READ ALSO : Jeevan Reddy: ప్రత్యర్థులు మారినా.. ఎన్నికల రణక్షేత్రాన్ని వీడని జీవన్‌రెడ్డి

అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీగా 12.11.2023 నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ucil.gov.in/ పరిశీలించగలరు.