Vacancies in National Hydro Electric Power Corporation
NHPC Recruitment : ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హరియాణా ఫరీదాబాద్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 401 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీల్లో ట్రైనీ ఇంజినీర్ (సివిల్) (136), ట్రైనీ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) (41), ట్రైనీ ఇంజినీర్ (మెకానికల్) (108), ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్) (99), ట్రైనీ ఆఫీసర్ (హెచ్‌ఆర్) (14), ట్రైనీ ఆఫీసర్ (లా) (03) ఖాళీలు ఉన్నాయి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్, డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ ఉత్తీర్ణతతతో పాటు గేట్-2022, యూజీసీ-నెట్-డిసెంబర్ 2021, జూన్ 2022, క్లాట్ 2022 (పీజీ) స్కోరు సాధించి ఉండాలి.
అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను గేట్ స్కోర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ కు జనవరి 25, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nhpcindia.com/ పరిశీలించగలరు.