Post Office Recruitment :
Post Office Recruitment : దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30,041 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్), బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
READ ALSO : Watermelon : ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి మంచిదేనా ?
ఖాళీగా ఉన్న పోస్టుల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 1058 , తెలంగాణలో 961 వరకు ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష సబ్జెక్టులతో పదో తరగతిపాసై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే పని చేయవల్సి ఉంటుంది.
READ ALSO : Boys saved the dog : కుక్కను కాపాడటానికి ప్రాణాలకు తెగించిన చిన్నారులు .. బంగారాలంటూ నెటిజన్లు ప్రశంసలు
అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000ల నుంచి రూ.29,380ల జీతంగా చెల్లిస్తారు. ఏబీపీఎం/డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000ల నుంచి రూ.24,470ల జీతంగా చెల్లిస్తారు. ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ అందజేస్తారు.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరితేదీగా ఆగస్టు 23, 2023ని నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://indiapostgdsonline.gov.in/ పరిశీలించగలరు.