RITES Recruitment : రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్‌లో ఖాళీల భర్తీ
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంట్‌యేషన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

RITES Recruitment
RITES Recruitment : రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్‌లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 111 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Japan Minister In Delhi Metro : ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో జపాన్ మంత్రి .. భారత్ తో బంధం బలమైనదన్న హయషి
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంట్‌యేషన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ,ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. భర్తీ చేయనున్న పోస్టుల్లో CAD డ్రాఫ్ట్స్‌మ్యాన్, జూనియర్ డిజైన్ ఇంజనీర్, HVAC ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ చివరి తేదిగా 07 ఆగస్టు 2023ని నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://rites.com/ పరిశీలించగలరు.