Vacancy in Niveli Lignite Corporation
NLC Job Vacancies : తమిళనాడులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీ)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన ద్వారా మొత్తం 103 నర్స్, పారామెడికల్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నర్సింగ్ అసిస్టెంట్, మెటర్నిటీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Weight Loss : బరువు తగ్గే ప్రక్రియలో కేలరీలే ఎందుకు కీలకం !
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్‌ఎఎస్‌ఎల్‌సీ,హెచ్‌ఎస్‌సీ, 12వ తరగతి, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, బీఎన్‌టీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 55 ఏళ్లకు మించరాదు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు
రూ.25,000ల నుంచి రూ.34,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
READ ALSO : Sciatica Pain : సయాటికా నొప్పి నుండి ఉపశమనాకి ఎఫెక్టివ్ రెమెడీగా దోహదపడే పారిజాతం !
అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో జూన్ 1, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.486,
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీలకు చెందినవారు రూ.236లు అప్లికేషన్ ఫీజు గాచెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nlcindia.in/ పరిశీలించగలరు.