JOBS : విశాఖ నేషనల్ లా యూనివర్శిటీలో పోస్టుల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి. నెట్, స్లెట్, సెట్ అర్హత, టీచింగ్, పరిశోధన అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.

Visakha National Law University

JOBS : విశాఖ పట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా విశ్వవిద్యాలయంలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలకు సంబంధించి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, టీచింగ్ అసోసియేట్, రిసెర్చ్ అసిస్టెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి. నెట్, స్లెట్, సెట్ అర్హత, టీచింగ్, పరిశోధన అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులను షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చిరునామా ; ది రిజిస్ట్రార్, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ, సబ్బవరం, విశాఖపట్నం-531035, దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేదిగా ఆగస్టు 20, 2022 ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://dsnlu.ac.in పరిశీలించగలరు.