Various vacancies are filled in Cabinet Secretarial in New Delhi
Cabinet Secretariat Recruitment : న్యూదిల్లీలోని క్యాబినెట్ సెక్రటేరియల్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన గ్రూప్ బి, నాన్ గెజిటెడ్ గ్రేడులో డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే డిగ్రీ, చైనీస్ భాషలో డిప్లొమా , చైనీస్ భాషలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు ఆఖరు తేదిగా నవంబరు 21, 2022 ను నిర్ణయించారు. దరఖాస్తు కాఫీలను పంపాల్సిన చిరునామా ; పోస్ట్ బాక్స్ నెం 001, లోధి రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూదిల్లీ, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; cabsec.nic.in పరిశీలించగలరు.