IIT Bombay Recruitment
IIT Bombay Recruitment : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబేలో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలో టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్టుల నియామకాలు జరపనున్నారు.
READ ALSO : Blood Pressure : రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు వాల్ నట్స్ తీసుకోవటం మంచిదా ?
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్). డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ , ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు 6సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయస్సు 32 సంవత్సరాలలోపు ఉండాలి.
READ ALSO : Uttar Pradesh: టోల్ చార్జ్ అడిగినందుకు టోల్ ప్లాజా ఉద్యోగిని కారుతో తొక్కి చంపి పరారైన దుండగుడు
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.44900- రూ.1,42,400.వేతనంగా చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజుగా రూ.50. చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు తుదిగడువు ఆగస్టు 24, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iitb.ac.in/ పరిశీలించగలరు.