VVC Motors Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో జాబ్స్.. నెలకు రూ.18 వేలు జీతం

కరీంనగర్ లో వీవీసీ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ తమ కంపనీలో ఉద్యోగ అవకాశాల కోసం జాబ్ మేళా నిర్వహించనుంది.

vvc motors

కరీంనగర్ లో ఉన్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. వీవీసీ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ తమ కంపనీలో ఉద్యోగ అవకాశాల కోసం జాబ్ మేళా నిర్వహించనుంది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది. ఈనెల (జూన్) 10 మంగళవారం రోజున కరీంనగర్ లోని కాశ్మీర్‌గడ్డ ఈ-సేవ కేంద్రంపై అంతస్తులో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ జాబ్ మేళా జరుగనుంది. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి అధికారి వై.వి. తిరుపతిరావు తెలిపారు. వీవీసీ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఎలక్ట్రికల్ వెహికల్ సర్వీస్ టెక్నాలజీ, ఆటోమోటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ వంటి వివిధ విభాగాల్లో మొత్తం 60 పోస్టుల కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.

విద్యా మరియు వయోపరిమితి: ఈ మేళాలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు పదవ తరగతి పాసై ఉండాలి. ఆపై ఐటీఐ, డిప్లొమా ఆపై చదివిన వారు అర్హులే. వయసు 18 నుంచి 30 లోపువారై ఉండాలి.

జీతం వివరాలు: నెలకు రూ.12 వేల నుంచి 18 వేల వరకు ఉంటుంది.

జాబ్ మేళా వివరాలు: జూన్ 10 మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఈ మేళా మొదలవుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ చదువుకు సంబందించిన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను తీసుకొని రావాల్సి ఉంటుంది.