When Will CAT 2024 Results Be Announced
IIM CAT 2024 Results : ఐఐఎమ్ కలకత్తా నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2024 ఫలితాలు అతి త్వరలో విడుదల కానున్నాయి. గత ట్రెండ్‌ల ప్రకారం.. ఐఐఎమ్ క్యాట్ 2024 ఫలితాలు డిసెంబర్ 20, 2024 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
క్యాట్ 2024 అభ్యర్థులు తమ ఫలితాలను ప్రకటించిన తర్వాత అధికారిక వెబ్‌సైట్ (iimcat.ac.in)లో చూసుకోవచ్చు. అధికారిక ధృవీకరణ చేయనప్పటికీ, వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా విజిట్ చేయడం ద్వారా అప్‌డేట్‌గా ఉండాలి.
క్యాట్ 2024 పరీక్ష నవంబర్ 24, 2024న నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో సుమారు 2.39 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ప్రొవిజనల్ ఆన్సర్ కీలు డిసెంబర్ 3, 2024న విడుదల అయ్యాయి. అభ్యంతరాలను సమర్పించడానికి డిసెంబర్ 5, 2024 వరకు సమయం ఇచ్చారు. క్యాట్ 2024 ఫలితం తేదీ క్యాట్ ఫలితాలు జనవరి 2025 మధ్య నాటికి విడుదల అవుతాయని అధికారిక నోటిఫికేషన్ పేర్కొంది.
అయితే, చారిత్రక ట్రెండ్‌ల ఆధారంగా ఫలితాలు డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 20, 2024 మధ్య వెలువడతాయని అంచనా. స్కోర్‌కార్డ్‌లోని వివరాలు ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్కోర్‌కార్డ్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
• రిజిస్ట్రేషన్ నంబర్/యూజర్ ఐడీ
• అభ్యర్థి పేరు, కేటగిరీ, లింగం
• పుట్టిన తేదీ
• పరీక్ష తేదీ, సమయం
• కాంటాక్టు వివరాలు (ఇమెయిల్, ఫోన్ నంబర్)
• క్యాట్ స్కేల్ స్కోర్ (మొత్తం)
• క్యాట్ విభాగాల వారీగా స్కోర్
• క్యాట్ పర్సంటైల్ స్కోర్ ( మొత్తం విభాగాల వారీగా)
• క్యాట్ స్కోర్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే.. అభ్యర్థులు వెంటనే సరిదిద్దడానికి సంబంధిత అధికారులను సంప్రదించాలి.
Read Also : AIBE 19 Admit Card 2024 : ఏఐబీఈ 19 అడ్మిట్ కార్డు 2024 విడుదల.. ఈ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి!