World Top Universities: వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీల్లో అమెరికా హవా.. నంబర్ 1 ర్యాంక్ మాత్రం..

మొదటి వంద ర్యాంకుల్లో నాలుగు దేశాలకు (అమెరికా, యూకే, జర్మనీ, చైనా) చెందినవే 62 యూనివర్సిటీలు ఉండటం విశేషం.

World University Rankings 2024 top 100 Universities Details in Telugu

World Top Universities 2024: ప్రపంచంలోని బెస్ట్ యూనివర్సిటీల ర్యాంకింగ్స్ టాప్ 100లో భారత విశ్వవిద్యాలయాలకు స్థానం దక్కలేదు. టాప్ హండ్రెడ్ లిస్టులో అమెరికా, యూకే యూనివర్సిటీలు ఆధిపత్యం చెలాయించాయి. ఈ రెండు దేశాలకు చెందిన 47 యూనివర్సిటీలు టాప్ 100లో ర్యాంకులు కైవసం చేసుకుని సత్తా చాటాయి. భారత్ నుంచి బెస్ట్ యూనివర్సిటీగా ఎంపికైన బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) 250వ ర్యాంక్‌ దక్కించుకుంది.

మొదటి వంద ర్యాంకుల్లో నాలుగు దేశాలకు (అమెరికా, యూకే, జర్మనీ, చైనా) చెందినవే 62 యూనివర్సిటీలు ఉండటం విశేషం. 36 వర్సిటీలతో అమెరికా అగ్ర స్థానంలో నిలవగా.. నంబర్ వన్ ర్యాంకుతో పాటు 11 స్థానాలతో యూకే సెకండ్ పొజిషన్ లో ఉంది. జర్మనీ నుంచి 8, చైనా నుంచి 7 యూనివర్సిటీలు టాప్ 100లో చోటు సంపాదించాయి. 6 నెదర్లాండ్, 5 హాంకాంగ్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

టాప్ 10 లిస్ట్ ఇదే..
ఇక యూనిర్సిటీల పరంగా చూస్తే.. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం టాప్ ర్యాంకులో నిలిచింది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం (2), మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (3), హార్వర్డ్ విశ్వవిద్యాలయం (4), కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం(5), ప్రిన్స్టటన్ విశ్వవిద్యాలయం (6), కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (7), ఇంపీరియల్ కాలేజ్ లండన్ (8), యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (9), యేల్ విశ్వవిద్యాలయం (10) టాప్ టెన్ లో ఉన్నాయి.

Also Read: భారత్ లోని ఉత్తమ యూనివర్సిటీ ఏదో తెలుసా.. వరల్డ్ బెస్ట్ లిస్ట్ లో మనవి ఎన్ని?

ట్రెండింగ్ వార్తలు