World University Rankings: భారత్ లోని ఉత్తమ యూనివర్సిటీ ఏదో తెలుసా.. వరల్డ్ బెస్ట్ లిస్ట్ లో మనవి ఎన్ని?

టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) మ్యాగజైన్ తాజాగా వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకులను ప్రకటించింది. ఈసారి రికార్డు స్థాయిలో మనదేశం నుంచి 91 విశ్వవిద్యాలయాలకు చోటు దక్కింది.

World University Rankings: భారత్ లోని ఉత్తమ యూనివర్సిటీ ఏదో తెలుసా.. వరల్డ్ బెస్ట్ లిస్ట్ లో మనవి ఎన్ని?

World University Rankings 2024 Best Indian Institutes Details in Telugu

World University Rankings 2024: ప్రపంచంలోని బెస్ట్ యూనివర్సిటీల లేటెస్ట్ లిస్ట్ వచ్చేసింది. యూకేకు చెందిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) మ్యాగజైన్ తాజాగా వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకులను ప్రకటించింది. ఈసారి రికార్డు స్థాయిలో మనదేశం నుంచి 91 విశ్వవిద్యాలయాలు చోటు సంపాదించడం విశేషం. గతేడాది భారత్‌ నుంచి 75 ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రమే ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. భారత్ నుంచి బెస్ట్ యూనివర్సిటీగా బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) మరోసారి తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఇండియాకు 4వ స్థానం
2024 వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ పేరుతో రూపొందించిన ఈ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. అమెరికా, యూకే.. మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. గతేడాది 6వ ర్యాంక్ లో ఉన్న ఇండియా ఈసారి రెండు స్థానాలు ఎగబాకింది. బెంగుళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కూడా 2017 తర్వాత తొలిసారిగా గ్లోబల్ 250 ర్యాంక్‌కు చేరుకోవడం విశేషం.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తర్వాత, అన్నా యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శూలినీ యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌లు మన దేశం నుంచి ఉత్తమ ర్యాంకులు దక్కించుకున్నాయి. ఈ విశ్వవిద్యాలయాలన్నీ 501-600 ర్యాంకుల మధ్యలో ఉన్నాయి.

Also Read: విన్నింగ్ ట్రోఫీని వ‌ద్ద‌న్న‌ రోహిత్ శ‌ర్మ‌.. వీడియో వైర‌ల్‌.. నెట్టింట ప్ర‌శంస‌ల జ‌ల్లు

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, కోయంబత్తూరులోని భారతియార్ విశ్వవిద్యాలయం ర్యాంకులు మెరుగయ్యాయి. గతేడాది 801-1000 ర్యాంకుల మధ్యలో ఉన్న ఈ రెండు వర్సిటీలు తాజాగా 601-800 మధ్య ర్యాంకులు పొందాయి. ఐఐటీ గువాహటి, ఐఐటీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) ధన్‌బాద్ వరల్డ్ టాప్ 800 విశ్వవిద్యాలయాలలో స్థానం దక్కించుకున్నాయి. జైపూర్ లోని మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా తొలిసారిగా టాప్ 800 జాబితాలో చేరింది.

ర్యాంకింగ్‌లకు ఐఐటీలు దూరం
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకులకు అగ్రశ్రేణి ఐఐటీలు దూరంగా ఉన్నాయి. ర్యాంకుల్లో పారదర్శత, ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వరుసగా నాలుగో ఏడాది ర్యాంకింగ్‌లను బహిష్కరించాయి. బాంబే, ఢిల్లీ, గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ ఐఐటీలు వీటిలో ఉన్నాయి. ఐఐటీ గువాహటి గత సంవత్సరమే ర్యాంకింగ్స్‌లో చేరింది.