81% voter turnout recorded in Tripura election
Tripura Polls: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఓటింగ్.. సాయంత్రం 4 గంటల వరకు సాగింది. మొత్తం 3,337 పోలింగ్ కేంద్రాల్లో 1,100 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా 28 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి కట్టుదిట్టమైన ఏర్పాట్టు చేశారు. అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగినా రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకునే త్రిపుర ఓటర్లు ఈసారి మాత్రం కాస్త వెనక్కు తగ్గారు. ఈసారి కేవలం 81 శాతమే ఓటింగ్ నమోదు అయింది. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 91 శాతం ఉంది.
Fraud In Karimnagar : కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం.. వెండి కాయిన్స్ కు బంగారు పూత వేయించి విక్రయం
రాష్ట్రంలో ఓటింగ్ సాగుతుండగా పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో గొడవ సైతం జరిగింది. ఈ గొడవల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేత సహా మరో ఇద్దరు పోలింగ్ సిబ్బంది గాయపడ్డారు. సేపాహిజలా జిల్లాలోని బోక్సానగర్ ప్రాంతంలోని సీపీఎం నేతపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సీపీఎం పోలింగ్ ఏజెంట్లపై సైతం దాడులు జరిగాయి. దీనిపై సీపీఎం రాష్ట్ర అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక నిత్యకృత్యం అయ్యాయని ఆయన మండిపడ్డారు.
Twitter: ఢిల్లీ, ముంబై ఆఫీసుల్ని మూసేసిన ట్విట్టర్.. ఇండియాలో మిగిలింది ఇక ఒక్కటే ఆఫీస్
60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపుర అసెబ్లీకి వివిధ పార్టీల నుంచి, స్వతంత్ర అభ్యర్థులుగా 259 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో మహిళలు కేవలం 20 మంది మాత్రమే ఉన్నారు. అయితే పోలింగుకు ముందే త్రిముఖ పోటీగా కనిపించిన ఈ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గడంతో వల్ల పరిస్థితి మరింత తీవ్రమైనట్లు విశ్లేషనలు వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ముందంజంలో ఉందనే విశ్లేషణలు ఎక్కువగానే వినిపిస్తున్నప్పటికీ, దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఏలిన సీపీఎం, ఈసారి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బాగానే పుంజుకుందని, కాస్త అటు ఇటైనా అధికారం కొట్టేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
Haryana: హర్యానాలో కిరాతకం.. ఇద్దరు ముస్లింల సజీవ దహనం.. గోసంరక్షకులపై కేసు నమోదు
ఇక ఈ రెండు కూటములను కాదని స్థానిక పార్టీ ఒకటి పోటీలో ప్రధానంగా నిలిచింది. స్థానిక పార్టీ తిప్రా మోర్చా జాతీయ పార్టీలకు ఒణుకు పుట్టిస్తోంది. రాష్ట్రంలోని తిప్రా ఆధిపత్య ప్రాంతాలను నిర్వహించే త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్(టీటీఏడీసీ)కి 2021లో జరిగిన ఎన్నికలలో తిప్రా మోత మంచి ఫలితాలు సాధించింది. టీటీఏడీసీలోని 30 స్థానాలకు గానూ ఆ పార్టీ 18 సీట్లు గెలుచుకుంది. 60 మంది సభ్యుల శాసనసభలో 20 గిరిజనుల ఆధిపత్య స్థానాల్లో తిప్రా మోత తన ప్రభావాన్ని చూపుతుంది. ఆ పార్టీ 42 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక దీనితో పాటు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువుల కారణంగా స్థానిక గిరిజనులు తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్నారు. ఈ మద్దతు కూడా ఆ పార్టీకి బాగా కలిసి వస్తుందని అంటున్నారు.
IT Raids On BBC: ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఎట్టకేలకు ముగిసిన ఐటీ సోదాలు
ఏ ఒక్క కూటమికో, పార్టీకో మెజారిటీ మాట అటుంచితే, హంగ్ ఏర్పడే పరిస్థితి సైతం లేకపోలేదనే అంచనాలు కూడా వస్తున్నాయి. మూడు ప్రధాన పోటీదారులుగా ఉన్న చోట ఇలాంటివి అనేకసార్లు జరిగినట్లు ఉదాహరణలు ఇస్తున్నారు. అయితే తగ్గిన ఓటింగ్ కారణంగా విశ్లేషకులు సైతం కచ్చితమైన అభిప్రాయం చెప్పలేకపోతున్నారు.