Fraud In Karimnagar : కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం.. వెండి కాయిన్స్ కు బంగారు పూత వేయించి విక్రయం

కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. వెండి కాయిన్స్ కు బంగారు పూత వేయించి అమ్ముతున్న ముఠా పోలీసులకు చిక్కింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Fraud In Karimnagar : కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం.. వెండి కాయిన్స్ కు బంగారు పూత వేయించి విక్రయం

gang arrested

Fraud In Karimnagar : కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. వెండి కాయిన్స్ కు బంగారు పూత వేయించి అమ్ముతున్న ముఠా పోలీసులకు చిక్కింది. ఆర్థిక ఇబ్బందులతో ఈ మోసానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లో ఓ ముఠా 40 వెండి కాయిన్స్ కొనుగోలు చేసి వాటికి బంగారం పూత వేయించి విక్రయిస్తున్నారు. పెళ్లి కానుక కోసమంటూ మోసానికి పాల్పడ్డారు. వేములవాడకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

వారి నుంచి 40 బంగారం పూత వేసిన వెండి కాయిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వేములవాడకు చెందిన రాజయ్య, తిరుపతి, భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 40 బంగారం పూత వేయించిన వెండి కాయిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులు వేములవాడలో నివసిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న ముగ్గురుు వ్యక్తులు వెండి బిల్లలకు బంగారం పూత పూయించారు.

Aadhaar Finger Prints : బీ కేర్ ఫుల్.. ఆధార్ ఫింగర్ ప్రింట్స్‪తో ఘరానా మోసం, సైబర్ క్రిమినల్ అరెస్ట్

బంగారం పూత పూయించిన వెండి కాయిన్స్ ను బంగారం కాయిన్స్ గా నమ్మించి విక్రయించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ లో వాహనాల తనికీల్లో ముగ్గురు యువకులు పట్టపడ్డారు. స్థానికంగా ఉన్న ఓ బంగారు వ్యాపారి వద్ద వెళ్లారు. ఫంక్షన్ ఉందని.. బంగారు బిల్లలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. వెండి బిల్లలు ఇచ్చి వాటికి బంగారు పూత వేయాల్సిందిగా కోరారు.  దీంతో వ్యాపారి వెండి బిల్లలకు బంగారు పూత వేశారు.

చూసిన వారికి అవి బంగారు బిల్లులుగానే ఉండటంతో సులువుగా విక్రయించవచ్చని భావించారు. అయితే వీరు ప్లాన్ వేసినప్పటికీ ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. వెండి బిల్లలకు బంగారు పూత వేయించడం, అలాగే వాటిని మార్కెట్లో విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి మోసాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.