IT Raids On BBC: ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఎట్టకేలకు ముగిసిన ఐటీ సోదాలు

బీబీసీ అనుబంధ సంస్థల అంతర్జాతీయ పన్నులు, బదిలీ ధరలతో ముడిపడి ఉన్న సమస్యలను సర్వే పరిశోధించిందని సమాచారం. కొంతమంది ప్రతీకార చర్యలు అని విమర్శిస్తున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు, సలహాదారులు ప్రకారం ఇది బదిలీ ధర నిబంధనలకు సంబంధించినదని, లాభాల మళ్లింపుకు సంబంధించినదని పేర్కొన్నారు. బీబీసీకి గతంలో పన్ను నోటీసులు అందజేశామని, అయితే సరైన సమాధానం ఇవ్వలేదని వారు పేర్కొన్నారు

IT Raids On BBC: ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఎట్టకేలకు ముగిసిన ఐటీ సోదాలు

Income Tax survey at BBC offices in Delhi, Mumbai ends nearly 3 days

IT Raids On BBC: దేశంలోని పలు బీబీసీ కార్యాలయాలపై ఐటీ (ఆదాయపు పన్ను) శాఖ చేపట్టిన సోదాలు ఎట్టకేలకు ముగిశాయి. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు మొత్తంగా 60 గంటల పాటు కొనసాగాయి. ఐటీ శాఖకు చెందిన అధికారులు బీబీసీ కార్యాలయల్లోనే నిద్రపోయి మరీ సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబై కార్యాలయాల్లోని సిబ్బందికి సంబంధించిన ల్యాప్‌టాప్స్, మొబైళ్లను స్వాధీనం చేసుకుని వాటిని నిశితంగా పరిశీలించారు. ఇక ఐటీ సోదాల కారణంగా మూడు రోజులుగా కార్యాలయాల్లోనే ఉన్న 10 మంది సీనియర్ ఎడిటర్స్ ఇంటికి వెళ్లినట్లు సమాచారం. డిజిటల్ రికార్డ్స్, ఫైల్స్ చేత పట్టుకుని ఐటీ అధికారులు బీబీసీ కార్యాలయాన్ని ఖాళీ చేశారు.

Interesting Facts : ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ చేసే డాక్టర్లు.. గ్రీన్, బ్లూ కలర్ డ్రెస్ ఎందుకు ధరిస్తారో తెలుసా? అసలు రీజన్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఇక మూడు రోజుల సోదాలకు సంబంధించిన స్టేట్మెంట్‭ను ఐటీ శాఖ శుక్రవారం వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు తమ ఫోన్లను క్టోన్ చేశారని, టాక్స్, బ్లాక్ మనీ, బినామీ వంటి కీ వర్డ్స్‭తో స్కాన్ చేసినట్లు బీబీసీ ఉద్యోగులు తెలిపారు. ‘‘ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఢిల్లీ, ముంబైలోని మా కార్యాలయాలను ఖాళీ చేశారు. మేము అధికారులకు సహకరిస్తాము. అలాగే వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరమవుతాయని ఆశిస్తున్నాము. దీనితో పాటు మా సిబ్బందికి అండగా ఉంటాము. వీరిలో కొందరు సుదీర్ఘమైన ప్రశ్నలను ఎదుర్కొన్నారు. వాళ్లు రాత్రిపూట ఉండవలసి వచ్చింది. వారి సంక్షేమమే మా ప్రాధాన్యత. మా అవుట్‌పుట్ సాధారణ స్థితికి చేరుకుంది. భారతదేశ ప్రేక్షకులతో పాటు వెలుపల ఉన్న మా ప్రేక్షకులకు రోజూ వారిలాగే వార్తలు, కథనాలు అందించడానికి కట్టుబడి ఉన్నాము’’ అని బీబీసీ ప్రెస్ టీం ట్వీట్ చేసింది. అలాగే ‘‘బీబీసీ అనేది నమ్మకమైన, స్వతంత్రమైన మీడియా సంస్థ. భయపడకుండా, ఎవరిపై పక్షపాతం చూపించకుండా రిపోర్టింగ్ చేసే మా జర్నలిస్టులకు మేము అండగా ఉంటాము’’ అని పేర్కొన్నారు.

BJP Minister Ashwattha Comments : కర్ణాటక బీజేపీ మంత్రి అశ్వత్థ నారాయణ సంచలన వ్యాఖ్యలు.. సిద్ధరామయ్యను చంపేయాలని కార్యకర్తలకు పిలుపు

బీబీసీ అనుబంధ సంస్థల అంతర్జాతీయ పన్నులు, బదిలీ ధరలతో ముడిపడి ఉన్న సమస్యలను సర్వే పరిశోధించిందని సమాచారం. కొంతమంది ప్రతీకార చర్యలు అని విమర్శిస్తున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు, సలహాదారులు ప్రకారం ఇది బదిలీ ధర నిబంధనలకు సంబంధించినదని, లాభాల మళ్లింపుకు సంబంధించినదని పేర్కొన్నారు. బీబీసీకి గతంలో పన్ను నోటీసులు అందజేశామని, అయితే సరైన సమాధానం ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యూమెంటరీ ప్రసారం చేసిన అనంతరం ఆ సంస్థ కార్యాలయాల్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించడంపై రాజకీయ దుమారం రేగింది. గుజరాత్ డాక్యూమెంటరీ ప్రసారం చేసిన ఫలితంగానే బీజేపీ ఇలా ప్రతీకర చర్యలకు పాల్పడుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే బీబీసీ విషపూరితమైన ప్రచారం చేస్తోందని అధికార బీజేపీ ప్రతిదాడి చేస్తోంది. భారత్‌లో బీబీసీని నిషేధించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు గత వారం కొట్టివేసింది. ఈ అభ్యర్థనను అర్థరహితమైందిగా, ఎంతమాత్రం అర్హత లేనిదిగా కోర్టు పేర్కొంది.