Haryana: హర్యానాలో కిరాతకం.. ఇద్దరు ముస్లింల సజీవ దహనం.. గోసంరక్షకులపై కేసు నమోదు

ఇద్దరు సజీవ దహనమయ్యారా లేక కారులో మంటలు చెలరేగి చనిపోయారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కిడ్నాప్‌కు గురైన ఇద్దరు వ్యక్తుల కుటుంబీకులు వాహనాన్ని గుర్తించి కారు యజమాని నసీర్ సహా జునైద్‌లని చెప్పారు. ఈ మరణాల్లో గోసంరక్షకుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు

Haryana: హర్యానాలో కిరాతకం.. ఇద్దరు ముస్లింల సజీవ దహనం.. గోసంరక్షకులపై కేసు నమోదు

Burnt Bodies Of 2 Muslim Men Found In Haryana

Haryana: దేశ రాజధాని సరిహద్దు రాష్ట్రమైన హర్యానాలో దారుణం వెలుగు చూసింది. ఇద్దరు ముస్లిం వ్యక్తుల్ని కారుతో సహా సజీవదహనం చేశారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నాసిర్ (25), జునైద్ (35) అనే ఇద్దరు వ్యక్తులు రెండు రోజుల క్రితమే కిడ్నాప్‭కు గురయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అనంతరం హర్యానాలోని భివానీ జిల్లాలో గురువారం ఉదయం మహీంద్రా బొలెరో ఎస్‌యూవీలో కాలిబూడిదై కనిపించారు. అయితే ఈ హత్య బుధవారమే జరిగినట్లు తెలుస్తోంది. కాగా, గోసంరక్షుకులుగా ప్రచారం అవుతున్న ఐదుగురు వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.

Ramcharitmanas Row: షాకింగ్ నిర్ణయం తీసుకున్న సమాజ్‭వాదీ పార్టీ.. ఆ ఇద్దరు మహిళా నేతలపై వేటు

ఈ విషయమై భరత్‌పూర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ గౌరవ్ శ్రీవాస్తవ స్పందిస్తూ “కారులో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల కాలిపోయిన మృతదేహాలు లభ్యమయ్యాయి. కిడ్నాప్ అయిన ఆ ఇద్దరు వ్యక్తులు, చనిపోయిన ఈ ఇద్దరు వ్యక్తులు ఒకరేనా కాదా అనేది నిర్ధారించడానికి మా బృందం కుటుంబ సభ్యులతో సంఘటనా స్థలానికి వెళ్ళింది. పోస్ట్ మార్టం, డీఎన్ఏ విశ్లేషణల అనంతరం వారి గుర్తింపు వెరిఫై చేయబడుతుంది” అని తెలిపారు.

Hyderabad Terror Conspiracy : హైదరాబాద్ లో ఉగ్రకుట్ర భగ్నం కేసులో మరొకరు అరెస్టు

ఇద్దరు సజీవ దహనమయ్యారా లేక కారులో మంటలు చెలరేగి చనిపోయారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కిడ్నాప్‌కు గురైన ఇద్దరు వ్యక్తుల కుటుంబీకులు వాహనాన్ని గుర్తించి కారు యజమాని నసీర్ సహా జునైద్‌లని చెప్పారు. ఈ మరణాల్లో గోసంరక్షకుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. జునైద్‌పై ఆవుల అక్రమ రవాణాకు సంబంధించి ఐదు కేసులు ఉన్నాయని, నసీర్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదని శ్రీవాస్తవ చెప్పారు. నసీర్, జునైద్‌లను కిడ్నాప్ చేసిన ఐదుగురు వ్యక్తులు మోను మనేసర్, లోకేష్ సింఘియా, రింకు సైనీ, అనిల్, శ్రీకాంత్ గా గుర్తించారు. మోను మనేసర్ బజరంగ్ దళ్ సభ్యుడు కాగా, మిగతావారు తాము గోసంరక్షకులమని గతంలో పేర్కొన్నారు.