By Polls: ఖాతా తెరవని కాంగ్రెస్.. బీజేపీకి పోటీనిచ్చిన స్థానిక పార్టీలు
అంధేరీ తూర్పు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీకి ప్రాంతీయ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురైంది. తెలంగాణలో టీఆర్ఎస్, బిహార్లో ఆర్జేడీ, ఒడిశాలో బీజేడీ పార్టీలు బీజేపీతో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడ్డాయి. ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి విపక్షాల నుంచి మద్దతు లభించినప్పటికీ.. బీజేపీకి సరైన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయింది. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ నుంచి తప్పుకుని మద్దతు ఇచ్చినప్పటికీ.. బీజేపీ ముందు నిలవలేకపోయింది.

Assembly Bypoll Results Live Updates
By Polls: ఈ నెల 3వ తేదీన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికలు ఆదివారం విడుదల అవుతున్నాయి. అయితే ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ చతిలికబడిపోయింది. ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోయింది. అదాంపూర్ మినహా మరే నియోజకవర్గంలో తన ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇందులో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు. అయినప్పటికీ పోటీ చేసిన స్థానాల్లో ఒక్క స్థానాన్ని సైతం నిలబెట్టుకోలేకపోయింది.
ఇక అంధేరీ తూర్పు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీకి ప్రాంతీయ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురైంది. తెలంగాణలో టీఆర్ఎస్, బిహార్లో ఆర్జేడీ, ఒడిశాలో బీజేడీ పార్టీలు బీజేపీతో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడ్డాయి. ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి విపక్షాల నుంచి మద్దతు లభించినప్పటికీ.. బీజేపీకి సరైన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయింది. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ నుంచి తప్పుకుని మద్దతు ఇచ్చినప్పటికీ.. బీజేపీ ముందు నిలవలేకపోయింది.
ముంబైలోని అంధేరీ తూర్పు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలేవీ పోటీలో లేకపోవడంతో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన గెలుపు దాదాపు ముందే ఖరారైంది. అయితే స్వతంత్ర అభ్యర్థుల పోటీ వల్ల ఎన్నిక అనివార్యమైంది. హర్యానాలోని అదాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభావం కనిపిస్తోంది. అయితే ఈ స్థానంలో బీజేపీ గెలుపు ఖరారైంది.
Munugode By-Election Counting : మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్