Assembly Elections 2023: తమను తాము నిరూపించుకోవడానికి చివరి అవకాశం ఉన్న బీజేపీ-కాంగ్రెస్ నేతలు?

చత్తీస్‌గఢ్‌లో ఈసారి బీజేపీ గెలుస్తుందా లేదా అనే సందేహం నెలకొంది. ఇక బీజేపీ నుంచి ఈసారి పార్టీలో అనుభవజ్ఞుడైన నాయకుడిగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం రమణ్ సింగ్ కు ఏర్పడింది

Assembly Elections 2023: తమను తాము నిరూపించుకోవడానికి చివరి అవకాశం ఉన్న బీజేపీ-కాంగ్రెస్ నేతలు?

Updated On : October 11, 2023 / 4:13 PM IST

Assembly Elections 2023: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి అధికారికంగా మొదలైంది. రాబోయే సవాల్‌కు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోరు సాగుతోంది. అయితే, ఈసారి అసెంబ్లీ ఎన్నికలు మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని అనుభవజ్ఞులైన నాయకులు తమ విశ్వసనీయతను నిరూపించుకోవడానికి చివరి అవకాశంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసుకుంటే.. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ సింగ్‌లపై దృష్టి పెడితే.. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రస్తుతం వెలుగులో ఉన్నారు.

మరోవైపు బీజేపీకి చెందిన పెద్ద నేతలు కూడా పార్టీలో తమ ప్రాభవాన్ని కోల్పోతున్నట్లు తెలుస్తోంది. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. మరోవైపు, రాజస్థాన్‌లో వసుంధర రాజే, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్ సింగ్ పరిస్థితి కూడా ఇదే. వాస్తవానికి వీరు ఆయా రాష్ట్రాల్లో ప్రముఖ వ్యక్తులే అయినప్పటికీ, ప్రస్తుతం దానిని నిలబెట్టుకోవడానికి చాలా పోరాడాల్సి వస్తోంది. మునుపటిలా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వీరిద్దరూ ఇప్పుడు ప్రధాన పాత్ర పోషించడం లేదు.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలకు చివరి అవకాశం?
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్న కమల్‌నాథ్ గత ఎన్నికల్లో అంటే 2018లో దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియాలను కలుపుకుని పోటీ చేసి విజయం సాధించారు. అయితే, ప్రారంభ ప్రచారంలో దిగ్విజయ్ సింగ్‌ను ప్రొజెక్ట్ చేయడంలో పార్టీ తడబడింది. వాస్తవానికి ఈయన గతంలో కాంగ్రెస్ నుంచి రెండు సార్లు సీఎం అయ్యారు. అయితే తన ప్రధాన్యతను నిలబెట్టుకునేందుకు ఆయన సర్వశక్తులూ ఒడ్డాల్సి వస్తోంది. ఇక దిగ్విజయ్ వివాదాస్పద ప్రకటన ఆయనకు కొత్త కష్టాల్ని తెచ్చి పెట్టింది.

తనను తాను పార్టీ ముఖంగా చూపించుకుంటున్న జ్యోతిరాదిత్య సింధియాను కమల్ నాథ్ గుర్తించలేదు. అయితే దిగ్విజయ్ సింగ్‌తో మాత్రం సన్నిహితంగానే మెదిలారు. పార్టీకి ఎంతో కీలకమైన మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌లో ఐక్యత తీసుకురావడంలో కమల్ నాథ్ విజయం సాధించారు. ఆ తర్వాత చౌహాన్ నేతృత్వంలోని 15 ఏళ్ల బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏడాదిన్నర తర్వాత సింధియా పార్టీ మారి బీజేపీలో చేరారు. అలాంటి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లో అధికారం కాంగ్రెస్‌ చేతుల్లో నుంచి జారిపోయి బీజేపీ చేతుల్లోకి వెళ్లింది.

ఇవి కూడా చదవండి: Assembly Eelections 2023: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? అంచనాలను తలకిందులు చేసిన సర్వే

ఇప్పుడు గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో కాంగ్రెస్ బలంగానే ఉందని ఆ పార్టీ చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇది స్పష్టంగా కనిపించింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌ సింగ్‌లను పెద్ద ముఖాలుగా కాంగ్రెస్‌ ప్రదర్శిస్తోంది. అయితే ఇరువురు నేతలకూ తమ విశ్వసనీయతను బలపరచడమే ప్రస్తుతం ఉన్న సవాలు. అదే సమయంలో బీజేపీ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు గెలవడమే పెద్ద సవాల్ అన్నట్లు కనిపిస్తోంది. నాలుగుసార్లు సీఎంగా ఉన్న ఆయనకు మూడో జాబితాలో టికెట్ ఇవ్వడంతో ఆయన బలహీనత స్పష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీ గెలిచినా.. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కే అధికారం దక్కుతుందా అనే ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది.

ఈ నాయకుల కుమారులు అయితే రాజకీయాల్లో ప్రముఖంగానే కనిపిస్తున్నారు. కమల్ నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ ఎంపీగా ఉన్నారు. రాజకీయాల్లో తరువాతి తరం నాయకుడిగా ఆయన ప్రముఖంగా కనిపిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు, శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ కూడా బుద్నిలో చాలా చురుకుగా ఉన్నారు. తన తండ్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తన ఇమేజ్ పెంచుకుంటున్నారు. 20 వేల మందితో కూడిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ కూడా వార్తల్లో నిలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న కాలంలో ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

రాజస్థాన్‌లో పెద్ద నాయకులకు పెద్ద సవాళ్లు
అశోక్ గెహ్లాట్ తన రాజకీయ నైపుణ్యం, ప్రజల మద్దతుతో మరో అవకాశం సంపాదించారు. తన తెలివితేటల వల్ల 2020లో పైలట్‌తో గొడవల మధ్య అధికారాన్ని జారవిడుచుకోకుండా సీఎం కుర్చీని దక్కించుకున్నారు. అయితే ప్రస్తుతం సచిన్ పైలట్ యువ నేతగా రోజురోజుకు ఎదుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గెహ్లాట్‌కు అధికారంలో కొనసాగడం కష్టంగానే మారింది. ఆయనకు వచ్చే నెల జరగబోయే ఎన్నికలు చివరి అవకాశంగా కనిపిస్తున్నాయి. మరో వైపు ఆయన అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా కుల గణనను నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Assembly Eelections 2023: ఛత్తీస్‭గఢ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? సర్వేలో ఆసక్తికమైన సమాధానం

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కూడా ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు. రాజస్థాన్ రాజకీయాల్లో ఈసారి తన విశ్వసనీయతను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరూ తమ నిర్ణయాలను బలంగా ప్రదర్శించలేకపోతున్నారంటే ఈ విషయం స్పష్టమవుతోంది.

15 ఏళ్ల సీఎం రమణ్‌సింగ్ కూడా అంతే
చత్తీస్‌గఢ్‌లో ఈసారి బీజేపీ గెలుస్తుందా లేదా అనే సందేహం నెలకొంది. ఇక బీజేపీ నుంచి ఈసారి పార్టీలో అనుభవజ్ఞుడైన నాయకుడిగా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం రమణ్ సింగ్ కు ఏర్పడింది. 2018లో చత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 90 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి 15 స్థానాలకు తగ్గగా, కాంగ్రెస్ సంఖ్యా బలం 71కి పెరిగింది. అయితే ఈ ఎన్నికల్లో పలువురు బీజేపీ నేతల సీట్లు ప్రమాదంలో పడ్డాయి.

రమణ్ సింగ్ 2008 నుంచి ఎమ్మెల్యేగా ఉన్న రాజ్‌నంద్‌గావ్ స్థానాన్ని కాపాడుకోవడంలో విజయం సాధించారు. రమణ్‌సింగ్‌ టిక్కెట్‌పై ఆందోళన చెందుతున్నారని కొంతకాలం క్రితం సీఎం భూపేశ్‌ బఘేల్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనిపై రమణ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘నా గురించి కాకుండా తన గురించి ఆందోళన చెందాలి. భాజపా 21 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అందులో విజయ్ బాఘెల్ పేరు కనిపించిన రోజు నుంచే భూపేష్ బఘేల్ కష్టాలు మొదలయ్యాయి’’ అని రమణ్ సింగ్ అన్నారు. సీఎం భూపేష్ బాఘేల్ ను ఇంతకు ముందు ఒకసారి విజయ్ బాఘేల్ ఓడించారు.