Nagaland Polls: నాగాలాండ్ బరిలో నలుగురే మహిళలు.. ఒక్కరు గెలిచినా చారిత్రక రికార్డే

దీమాపూర్-3 నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్‭డీపీపీ) అభ్యర్థిగా హేఖాని జఖలు, టేనింగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రస్ అభ్యర్థి రోసీ థాంప్సన్, పశ్చిమ అంగామి స్థానం నుంచి ఎన్‭డీపీపీ అభ్యర్థి సల్హోటువోనువో, అటోయిజు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాహులి సెమా అనే నలుగురు మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Nagaland Polls: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. పోలింగుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే 60 స్థానాలున్న నాగాలాండ్ అసెంబ్లీ పోరులో కేవలం నలుగురు అంటే నలుగురు మహిళలు మాత్రమే బరిలో ఉన్నారు. ఇందులో ఒక్కరు గెలిచినా నాగాలాండ్ ఎన్నికల చరిత్రలో ఒక మహిళ గెలిచినట్లే. కారణం.. ఇప్పటి వరకు జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మహిళ కూడా గెలవలేదు, సరికదా డిపాజిట్లు కూడా రావు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే.. ఆ రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల ఓటింగే ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ మహిళా అభ్యర్థులకు ఏమాత్రం ఆదరణ లేకపోవడం గమనార్హం.

Delhi Liquor Policy: మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేస్తుందా..? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర ట్వీట్ .. తన అభిప్రాయాన్ని తెలిపిన సిసోడియా..

దీమాపూర్-3 నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్‭డీపీపీ) అభ్యర్థిగా హేఖాని జఖలు, టేనింగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రస్ అభ్యర్థి రోసీ థాంప్సన్, పశ్చిమ అంగామి స్థానం నుంచి ఎన్‭డీపీపీ అభ్యర్థి సల్హోటువోనువో, అటోయిజు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాహులి సెమా అనే నలుగురు మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్క నాగాలాండే కాకుండా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో సామాజిక పోరాటంలో చాలా మంది మహిళా నాయకులు ఉన్నప్పటికీ రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం కరువైంది. ఎక్కడో ఒక చోట ఒక మహిళ ఎన్నికల్లో గెలిస్తే చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యేంతటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి.

Lok Sabha polls 2024: కేవలం ఏడాది మాత్రమే మిగిలి ఉంది: ప్రియాంకా గాంధీ

నాగాలాండ్ నుంచి గతంలో ఒకే ఒక్క మహిళ ఎన్నికల్లో గెలిచారు. అది కూడా లోక్‭సభ ఎన్నికల్లో. 1977లో జరిగిన ఎన్నికల్లో నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క లోక్‭సభ స్థానంలో యూనైటెడ్ డెమొక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన మెసె షజియా అనే మహిళ గెలిచారు. అంతే, ఇక అంతకు ముందు కానీ, తర్వాత కానీ నాగాలాండ్ చరిత్రలో మరే మహిళ జాతీయ, రాష్ట్ర చట్టసభలకు ఎన్నిక కాలేదు. అయితే ఈ మధ్య మరొక మహిళ పార్లమెంటుకు వెళ్లారు. ఎస్.ఫాంగ్నోన్ కోన్యాక్ అనే మహిళను పార్లమెంటుకు బీజేపీ నామినేట్ చేసింది. అయితే ప్రజల నుంచి మాత్రం ఎన్నుకోబడలేదు.

AP Government : ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవడానికి సిద్ధమైన ఏపీ సర్కార్

నాగాలాండ్ రాష్ట్రంలో మొత్తం 13,17,632 ఓటర్లు ఉన్నారు. ఇందులో 6,56,143 మంది అంటే 49.8 శాతం మహిళా ఓటర్లు. ఇక అసెంబ్లీ ఎన్నికల బరిలో 183 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో నలుగురు మహిళలు. రాష్ట్ర అసెంబ్లీలో 60 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక రాష్ట్రం నుంచి పార్లమెంటుకు రెండు ఉభయ సభలకు ఒక్కొక్క ప్రాతినిధ్యం ఉంది (ఒక లోక్‭సభ, ఒక రాజ్యసభ). ఇక తాజా ఎన్నికలు పోలింగ్ సోమవారం (ఫిబ్రవరి 27)న జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు