Delhi Liquor Policy: మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేస్తుందా..? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర ట్వీట్ .. తన అభిప్రాయాన్ని తెలిపిన సిసోడియా..

ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ అధికారులు ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం అతన్ని అరెస్టు చేస్తారన్న ప్రచారం పెద్దఎత్తున జరుగుతుంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Delhi Liquor Policy: మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేస్తుందా..? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర ట్వీట్ .. తన అభిప్రాయాన్ని తెలిపిన సిసోడియా..

Delhi liquor policy

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఆదివారం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను విచారించనున్నారు. సిసోడియా సీబీఐ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో దక్షిణ ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. సీబీఐ కేంద్ర కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంతేకాక, కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ఈమేరకు కార్యాలయం వెలుపల బ్యానర్లుసైతం ఏర్పాటు చేశారు. సిసోడియాను విచారించే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సీబీఐ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తారన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్థానిక పోలీసులు, పారా మిలటరీ బలగాలను భారీగా సంఖ్యలో మోహరించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సిసోడియాను విచారణ అనంతరం సీబీఐ అధికారులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. తిహార్ జైలులో ఉన్న బుచ్చిబాబును ప్రశ్నించనున్న ఈడీ

ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను సీబీఐ అధికారులు ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం అతన్ని అరెస్టు చేస్తారన్న ప్రచారం పెద్దఎత్తున జరుగుతుంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ దేవుడు నీతో ఉన్నాడు మనీశ్. లక్షలాది మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఉన్నాయి. దేశంకోసం, సమాజం కోసం జైలుకు వెళ్లినప్పుడు జైలుకు వెళ్లడం దుర్మార్గం కాదు, ఘనత. మీరు త్వరగా జైలు నుంచి తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ తాజా ట్వీట్‌తో సిసోడియా అరెస్టు ఖాయమన్న వాదన ఢిల్లీ రాజకీయాల్లో వినిపిస్తోంది.

Delhi Liquor Scam: విచారణకు హాజరుకాలేనన్న సిసోడియా.. సరేనన్న సీబీఐ

ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా సీబీఐ కార్యాలయంకు వెళ్లనున్న నేపథ్యంలో ఆయన ఇంటిబయట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అతని ఇంటి వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరించారు. సిసోడియా ఇంటి ప్రవేశానికి ఇరువైపులా నాలుగు లేయర్ల బారికేడ్లనుసైతం ఏర్పాటు చేశారు. సిసోడియా ఆదివారం ఉదయం సీబీఐ కార్యాలయం వద్దకు వెళ్లేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ఆప్ కార్యాకర్తలు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. సీబీఐ కార్యాలయంకు వెళ్లే క్రమంలో మనీశ్ సిసోడియా రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.

 

సీబీఐ కార్యాలయంకు వెళ్లేముందు ఆదివారం ఉదయం మనీశ్ సిసోడియా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నేను ఈ రోజు సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతున్నాను. విచారణకు పూర్తిగా సహకరిస్తాను. మరికొన్ని నెలలు జైలులోనే ఉండాల్సి వచ్చినా నేను లెక్కచేయను. నేను భగత్ సింగ్ ను అనుసరించే వ్యక్తి’ అంటూ సిసోడియా ట్వీట్ చేశారు.