Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. తిహార్ జైలులో ఉన్న బుచ్చిబాబును ప్రశ్నించనున్న ఈడీ

ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈడీ విచారించనుంది. ప్రస్తుతం బుచ్చిబాబు తిహార్ జైలులో ఉన్నాడు. ఆయనను ఈ నెల 8న సీబీఐ అరెస్టు చేసింది. తిహార్ జైలులోనే బుచ్చిబాబును ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. లిక్కర్ స్కాంకు సంబంధించి రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఆయనను అధికారులు ప్రశ్నిస్తారు.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. తిహార్ జైలులో ఉన్న బుచ్చిబాబును ప్రశ్నించనున్న ఈడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈడీ విచారించనుంది. ప్రస్తుతం బుచ్చిబాబు తిహార్ జైలులో ఉన్నాడు. ఆయనను ఈ నెల 8న సీబీఐ అరెస్టు చేసింది.

Wipro: ఫ్రెషర్లకు సగం జీతాలు కట్ చేసిన విప్రో.. అన్యాయమంటున్న ఐటీ ఉద్యోగుల సంఘం

గతంలో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఆడిటర్‌గా పని చేశారు. తిహార్ జైలులోనే బుచ్చిబాబును ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. లిక్కర్ స్కాంకు సంబంధించి రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఆయనను అధికారులు ప్రశ్నిస్తారు. మాగుంట రాఘవ ఇచ్చిన స్టేట్‌మెంట్‌సహా మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బుచ్చిబాబును అధికారులు ప్రశ్నిస్తారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, ముడుపుల వ్యవహారాల్లో బుచ్చిబాబు మధ్యవర్తిగా పనిచేశారు. ఢిల్లీలో సౌత్ గ్రూప్ కోసం పని చేశారు. ఈ విషయంలో ఇప్పటికే సుమారు 20 సార్లు బుచ్చిబాబును ఈడీ, సీబీఐ ప్రశ్నించింది.

Andhra Pradesh: ఏపీ గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన సీఎం జగన్.. బుధవారమే ఏపీకి రానున్న నూతన గవర్నర్

ఈడీ అనుబంధ చార్జిషీటులో బుచ్చిబాబు వాంగ్మూలానికి సంబంధించి కీలక వివరాలు పొందుపరిచారు. 2021 మార్చిలో అరుణ్ పిళ్ళై ఇండో స్పిరిట్ గ్రూప్ జాయింట్ వెంచర్ కోసం బుచ్చి బాబును సంప్రదించారు. ఈ అంశంపై పలుమార్లు సమీర్ మహేంద్రతో చర్చలు జరిపారు. న్యూఢిల్లీలోని గౌరీ అపార్ట్‌మెంట్లో ఆమ్ ఆద్మీకి చెందిన విజయ్ నాయర్‌ను అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు కలిశారు. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ కు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విజయ్ నాయర్ అని అరుణ్ పిళ్ళై, బుచ్చి బాబుకి చెప్పారు. ప్రభుత్వానికి, వ్యాపారులకు లాభం ఉండేలా మద్యం పాలసీ తయారు చేస్తున్నామని విజయ్ నాయర్ బుచ్చి బాబుకు వివరించారు. అనంతరం ఈ లిక్కర్ పాలసీలో భాగస్వామ్యం కావాలని విజయ్ నాయర్ బుచ్చి బాబును కోరారు.

Andhra Pradesh: తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే పిల్లలకు గుణపాఠం.. వృద్ధురాలైన తల్లిని వేధిస్తున్న కొడుకు, కోడలికి జైలు శిక్ష

ఫ్లాట్ లైసెన్స్, వినియోగం ఆధారిత లైసెన్స్‌లో ఉన్న పాలసీ లోపాలను విజయ్ నాయర్ బుచ్చి బాబుకు వివరించారు.  మాగుంట గ్రూప్‌ను తనకు పరిచయం చేయాలని సమీర్ మహేంద్ర, బుచ్చి బాబుని కోరాడు. దీంతో సమీర్ మహేంద్రను మాగుంట రాఘవ ఇంటికి తీసుకువెళ్ళి బుచ్చి బాబు పరిచయం చేశాడు. అయితే, ఒక సమావేశంలో పాల్గొన్నంత మాత్రాన తనపై నిందలు మోపడం సరికాదని బుచ్చి బాబు వాదించారు. తన ద్వారా డబ్బు చేతులు మారలేదని, ఈ కేసులో తాను లబ్ధి దారుడు కాదని బుచ్చి బాబు అంటున్నారు.